E-Paper
Advertisement

Tamil Nadu Road Accident: సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. పసికందు సహా 8 మంది మృతి.

Tamil Nadu Road Accident: సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. పసికందు సహా 8 మంది మృతి.
Advertisement

Tamil Nadu Road Accident: తమిళనాడులోని సేలం జిల్లాలో ఘోర రహదారి ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు మినీ వ్యాన్‌ను.. ఆ వెనుక వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ భీభత్సమైన ఘటనలో 11 నెలల పసికందు సహా ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉండటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాద వివరాల్లోకి వెళితే.. ఆర్టీసీ బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా దాని టైరు పేలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్‌పైకి దూసుకెళ్లింది. అదే సమయంలో వ్యాన్ వెనుక బైక్‌పై ప్రయాణిస్తున్న తల్లీకూతుళ్లు కూడా ఈ ప్రమాద ధాటికి గురై ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

ఒకే కుటుంబంలో ఐదుగురు సభ్యులు మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బస్సు టైరు పేలడమే ఈ పెను ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించింది. మితిమీరిన వేగం.. వాహనాల నిర్వహణ లోపం వల్ల ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Read Also: Poonam Bajwa: అమ్మాయిలతో బీ కేర్‌ఫుల్.. యువతకి పూనం హెచ్చరిక.. జాగ్రత్త పడాలంటూ!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×