BigTV English

Balineni: బాలినేనికి మళ్లీ అవమానం!.. కావాలనే చేశారా?

Balineni: బాలినేనికి మళ్లీ అవమానం!.. కావాలనే చేశారా?
balineni

Balineni srinivasa reddy latest news(AP political news): మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు. మాజీ అయినప్పటి నుంచీ వరుసగా అవమానాల పాలవుతున్నారు. జగన్ బంధువనే ప్రయారిటీ కూడా లేకుండా పోతోంది. ఎమ్మెల్యే మాత్రమే కావడంతో.. జిల్లాలో మంత్రి పెత్తనమే నడుస్తోంది. పార్టీలోనూ తన ప్రత్యర్థి వైవీ సుబ్బారెడ్డిదే హవా నడుస్తోంది. అధికారులెవరూ బాలినేని పట్టించుకోవడం లేదు. సీఎం జగన్ జిల్లాకు వస్తే.. కనీసం హెలికాప్టర్ దగ్గరికి కూడా వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఇదంతా సజ్జల డైరెక్షన్లో, వైవీ కనుసన్నల్లో, మంత్రి సురేశ్ ఆధ్వర్యంలో జరుగుతోందనేది బాలినేని భావన. అందుకే, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. జగన్ రెండుసార్లు బుజ్జగించారు. కొన్నాళ్లుగా కాస్త కామ్‌గా ఉంటున్నారు. తాజాగా, మరోసారి అవమానాల పాలయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..


ప్రకాశంలో అమ్మఒడి కార్యక్రమ ఫ్లెక్సీ ఏర్పాటు వివాదాస్పదమైంది. జగనన్న అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీని విద్యాశాఖ అధికారులు ఒంగోలు కలెక్టరేట్ దగ్గర ఏర్పాటు చేశారు. అయితే ఇందులో జిల్లా ఇంఛార్జి మంత్రి మేరుగ నాగార్జున, జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్, కలెక్టర్ దినేష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫోటోలు కనిపించలేదు. దీంతో నాలుక కర్చుకున్న అధికారులు.. దానిని తొలగించి వెంటనే మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. విద్యాశాఖ అధికారుల పనితీరు స్థానికంగా చర్చనీయాంశమైంది.

అయితే, ప్రస్తుత ఫ్లెక్సీ ఘటనలో బాలినేనిని మాత్రమే టార్గెట్ చేసినట్టు అనిపించట్లేదు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేల ఫోటోలు కూడా మిస్ అయ్యాయి. గతంలో ఫ్లెక్సీలో తన ఫోటో లేనందుకు బాలినేని హర్ట్ అయ్యారు. మరి, ఈసారి అడ్జస్ట్ అవుతారా? మళ్లీ అలక పూనుతారా?


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×