BigTV English

Vijayawada floods: విజయవాడ వరదలు.. టీవీ ఛానెళ్లపై సీఎం ఆగ్రహం.. జగన్ బాణం రివర్స్

Vijayawada floods: విజయవాడ వరదలు.. టీవీ ఛానెళ్లపై సీఎం ఆగ్రహం.. జగన్ బాణం రివర్స్

Vijayawada floods: బెజవాడ వరదలపై రాజకీయ రచ్చ కంటిన్యూ అవుతోంది. దీనిపై అధికార టీడీపీ- వైసీపీ మధ్య మాటల యుద్ధం తాారాస్థాయికి చేరింది. బెజవాడ వరద ముమ్మాటికీ మానవ తప్పిదమేనని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు రివర్స్ అయ్యాయి. ఈ వ్యవహారంలో వైసీపీ డిఫెన్స్‌లో పడిపోయింది. వైసీపీ నేతలతోపాటు టీవీ ఛానెళ్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు సీఎం చంద్రబాబు.


వైసీపీ అధినేత జగన్.. ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మలచుకోవడంలో తిరుగులేదని కొందరు సీనియర్ రాజకీయ నేతలు తరచూ చెబుతారు. వైసీసీ అధికారంలో ఉంటే సమస్యను తమకు అనుకూలంగా మలచుకుంటారు. అదే విపక్షంలో ఉంటే అవతలివారిపై నెట్టేయడం వెన్నతో పెట్టిన విద్య అని చెబుతున్నారు. విజయవాడ వదరల్లోనూ అదే జరిగింది.. జరుగుతోంది కూడా.

ALSO READ: ముంబై నటి కాదంబరి కేసు.. కొత్త ట్విస్ట్, గతరాత్రి…


విజయవాడ వరదలపై ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. వరద బాధితులకు ప్రతిపక్ష నేతగా భరోసా ఇవ్వాల్సిన వైసీపీ అధినేత జగన్.. చంద్రబాబు సర్కార్‌పై విరుచుకుపడ్డారు. వరద ముమ్మాటికీ మానవ తప్పిదమే అంటూ ఆగ్రహం వ్యక్తం‌చేశారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ స్క్రిప్ట్ లేకుండా చాలా తప్పులు మాట్లాడారు. ప్రస్తుతం ఆ మాటలు సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

వరదల్లో వైసీపీ వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. బాధ్యత లేకుండా ఆ పార్టీ ప్రవర్తించిందని దుయ్యబట్టారు. బాధితులకు భరోసా ఇవ్వకుండా శవ రాజకీయాలు చేసిందని తూర్పార బట్టారు. వైసీపీకి తోడు కొన్నిమీడియా ఛానెళ్లకు అదే పాట పాడటాన్ని తప్పుబట్టారు.

అందుకు ఉదాహరణ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విషయాన్ని ప్రస్తావించారు ముఖ్యమంత్రి. సాయం చేయాలని ఆయన భావించారని, జ్వరం కారణంగా రాలేకపోయారన్నారు. తనవంతు సాయం చేసిన విషయాన్ని వివరించారు. ఎవరికి తోచిన విధంగావారు సాయం చేస్తుంటే.. ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం నీచమైనది వర్ణించారు. ఇలాంటివారి వల్ల సమాజానికి చాలా ప్రమాదమన్నారు.

వైసీపీ ప్రభుత్వంలోనూ వరదలు వచ్చారు. విజయవాడు, తిరుపతి, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. ఆ సమయంలో మంత్రులు రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారీ వర్షాలు పడితే మానవ తప్పిందమని ఎలా అంటారని ప్రశ్నించారు. ఆనాడు వైసీపీ మంత్రులు కామెంట్స్ చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో జగన్ డిఫెన్స్‌లో పడిపోయారు.

 

Related News

Amaravati: దక్షిణాదికి శుభవార్త.. అమరావతి మీదుగా బుల్లెట్ రైళ్లు, ఎలైన్‌మెంట్‌కు ఆమోదం

AP investments: 53,922 కోట్ల పెట్టుబడులు.. 83,000 ఉద్యోగాలు.. ఏపీలో ఇక పండగే!

Vizag investment: విశాఖకు స్పెషల్ బూస్ట్‌.. ఐటీలో వేరే లెవల్.. భారీ పెట్టుబడి వచ్చేసిందోచ్!

Bapatla news: దివ్యాంగుల ధైర్యం.. బాపట్లలో వినూత్న వివాహం.. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే!

AP Govt updates: రైతులకు గుడ్ న్యూస్.. ఆ పంట కొనుగోలుకు రేటు ఫిక్స్.. మీరు సిద్ధమేనా!

AP family card: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో కొత్త కార్డు రెడీ.. ఎందుకంటే?

Big Stories

×