Fake Liquor Case: నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి రాగానే వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితులు అరెస్టు కావడంతో ఆనాటి నుంచి నేతలకు టెన్షన్ మొదలైంది. దాదాపు నెల రోజులుగా ఈ వ్యవహారంపై పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు. చివరకు ఛార్జిషీటు జోగి రమేష్ పేరు చేర్చింది. ఆ తర్వాత సిట్ వేగంగా అడుగులు వేసింది.
బిగ్ టీవీతో మాట్లాడిన జోగి రమేష్ భార్య
ఆదివారం ఉదయం జోగి రమేష్‌ని అరెస్టు చేసింది. అసలు అరెస్టుకు ముందు రమేష్ ఇంట్లో ఏం జరిగింది? ఆ విషయాలను బిగ్ టీవీతో పంచుకున్నారు ఆయన భార్య శకుంతల. కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర లేదని ఆయన భార్య శకుంతల బిగ్ టీవీతో చెప్పారు. కావాలనే ఈ కేసులో తన భర్తను ఇరికించారని తెలిపారు. చంద్రబాబు ఇంటికి వెళ్లినప్పటి నుంచి ఆయన కొడుకు లోకేష్ కక్ష పెంచుకున్నారని ఆరోపించారు.
గతంలో అగ్రి గోల్డ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని చెప్పారు. ఇప్పుడు కల్తీ మద్యం అంటున్నారని, దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేశామన్నారు. పైన దేవుడు ఉన్నాడని, అన్నీ చూసుకుంటాడని, మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఆనాడు నుంచి కక్ష పెంచుకున్నారు-శకుంతల
ఉదయం నాలుగున్నరకు వచ్చి తలుపులు దబ దబ కొడుతున్నారని, అందరూ ఉలిక్కిపడి లేచామన్నారు. కిందకు ఫోన్ చేస్తే.. వాచ్‌మేన్ అసలు విషయం చెప్పారని వివరించారు శకుంతల. అరెస్టు సమయంలో తమకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు. అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. అన్యాయంగా అరెస్టు చేశారని, న్యాయం తప్పుకుండా గెలుస్తుందన్నారు.
ALSO READ: జోగి రమేష్ అరెస్టుపై జగన్ రియాక్ట్
నచ్చని విషయాలు ప్రశ్నిస్తున్నందుకు కూడా కారణమన్నారు. ఆనాడు క్షమాపలు చెప్పడానికి వెళ్లారని, కానీ దాడి చేయడానికి వచ్చినట్టు కల్పించారన్నారు. వారికీ కుటుంబాలు ఉంటాయని, ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. రేపు రోజున జగన్ వచ్చి శిక్షించాల్సిన అవసరం లేదని, పైన దేవుడు ఉన్నాడని, ఏదో ఒకరోజు ఆయన శిక్షిస్తారన్నారు.
బిగ్ టీవీతో జోగి రమేష్ భార్య శకుంతల..
కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర లేదు
కావాలనే ఈ కేసులో నా భర్తను ఇరికించారు
చంద్రబాబు ఇంటికి వెళ్లినప్పటి నుంచి ఆయన కొడుకు లోకేష్ కక్ష్య పెంచుకున్నారు
గతంలో అగ్రి గోల్డ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు
ఇప్పుడు కల్తీ మద్యం… pic.twitter.com/8qUPcyo2JO
— BIG TV Breaking News (@bigtvtelugu) November 2, 2025