Buddha Venkanna: కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్‌పై హాట్ కామెంట్స్ చేశారు బుద్దా వెంకన్న. తప్పులు చేయడం, సమర్ధించుకోవడం వైసీసీ DNAలో ఉందన్నారు. అమ్మవారి గుడికి వెళ్లి దొంగ ప్రమాణం చేశాడు.. అందుకే అమ్మవారు కన్నెర్ర చేశారు. ప్రమాణం చేయకుండా ఉంటే రెండు, మూడు రోజులు బయట ఉండేవాడేమో అంటూ కామెంట్ చేశారు. జగన్ డైవర్షన్ రాజకీయాలు చేయడం అలవాటన్నారు. ఇంకా ఓవర్ చేస్తే.. నకిలీ మద్యం బాధితులు తాడేపల్లి ప్యాలెస్ ఎదుట ధర్నా చేస్తారంటూ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అక్టోబర్ 2025లో పేలుడు రేకెత్తించిన నకిలీ మద్యం కేసు, వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగి రమేష్ పేరును ముందుంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధన్ రావు, పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో జోగి రమేష్ ఆదేశాలతోనే నకిలీ మద్యం తయారీ జరిగిందని, వైసీపీ పాలనలో ఇది స్థిరపడిందని, టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే ఆపేశామని, 2025 ఏప్రిల్‌లో జోగి సూచనలతో మళ్లీ ప్రారంభించామని సంచలన వెల్లడి చేశారు. జనార్ధన్‌తో జోగి రమేష్ వాట్సాప్ చాట్‌లు, ఫేస్‌టైమ్ కాల్స్ కూడా లీక్ అయ్యాయి, ఇందులో జోగి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా రైడ్‌లు ఏర్పాటు చేశాడని ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ, కార్యకర్త బుద్దా వెంకన్న జోగి రమేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 16న విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “తప్పులు చేయడం, సమర్ధించుకోవడం.. వైసీపీ DNAలోనే ఉంది” అని అన్నారు. జోగి రమేష్ కీలక పాత్ర పోషించాడని, జనార్ధన్ స్వయంగా ప్రకటించాడని, తప్పు చేసి దొరికిపోయినా సిగ్గు లేకుండా వాగుతున్నాడని మండిపడ్డారు. “దొంగ ప్రమాణం చేసినందుకు అమ్మవారు కన్నెర్ర చేశారు” అని, “ప్రమాణం చేయకుండా ఉంటే 2-3 రోజులు బయట ఉండేవాడు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కల్తీ మద్యంతో సంబంధం లేని చంద్రబాబు ఎందుకు దుర్గమ్మ ఆలయంలో ప్రమాణం చేయాలని ప్రశ్నించారు.
“జోగి జోగి కలిస్తే బూడిద రాలినట్టు, జగన్-జోగి కలిస్తే బూడిద రాలుతుంది” అని, గత 5 ఏళ్లలో జగన్ అవినీతి, హత్యలు ప్రోత్సహించాడని, మద్యం కుంభకోణంలో 12 మంది జైలుకు వెళ్లారని ఆరోపించారు. “డైవర్షన్ రాజకీయాలు చేయడం జగన్‌కు అలవాటు. నకిలీ మద్యం జగన్ అమ్మకాలు చేశాడు. ఈ కేసులో చాలా మంది ఉన్నారు. నకిలీ మద్యం కంటే స్లో పాయిజన్ అనటం కరెక్ట్” అని విమర్శించారు. జగన్ ఎందుకు జోగిని సస్పెండ్ చేయలేదని నిలదీశారు. “ఎక్కువ ఓవర్‌రియాక్షన్ చేస్తే తాడేపల్లి ప్యాలెస్ వద్ద బాధితులు ధర్నా చేయాల్సి వస్తుంది. డబ్బుతో పాటు ప్రాణాలు కూడా పోయాయి. ఈ కేసులో పెద్ద పెద్ద వాళ్లు పేర్లు బయటికి వస్తాయి” అని సవాలు విసిరారు.
Also Read: నర్సాపూర్‌లో ఎకో పార్క్‌ను ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ
నేడు నవంబర్ 2 ఉదయం ఎన్‌టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసానికి సిట్ , ఎక్సైజ్ అధికారులు చేరుకుని, ఆయనతో పాటు పీఏ ఆరేపల్లి రామును అరెస్ట్ చేశారు. జనార్ధన్ వాంగ్మూలంతో ఆధారాలు సమర్పించబడ్డాయి. వైసీపీలో ఆందోళన, ప్రభుత్వం కక్ష్యాసాధన అని నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు జగన్ పాలనలో మద్యం వ్యాపారంపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. రాజకీయంగా డైలాగ్ వార్‌గా మారిన ఈ విషయం, రాష్ట్ర రాజకారణాన్ని మరింత వేడెక్కిస్తోంది.
వైసీపీ నేతలకు బుద్ధా వెంకన్న వార్నింగ్..
నకిలీ మద్యం కేసు విచారణకు సహకరించండి అంతే కానీ రాజకీయం చేద్దామంటే మీ పనై పోయినట్లే
ఐదేళ్ల వైసీపీ పాలనలో డిజిటల్ పేమెంట్లు లేకుండా మద్యం విక్రయించారు
జోగి రమేష్ ను పట్టుకుంటే తన పేరు ఎక్కడ బయటకు వస్తుందోనని జగన్ భయపడుతున్నారు
జోగి… pic.twitter.com/7TUqdSEehc
— BIG TV Breaking News (@bigtvtelugu) November 2, 2025