E-Paper
Advertisement

Bandla Ganesh Vs Vijayasai : ‘అలా ఎలా వదిలేశావ్.. బాబాయ్..’ మెుదలైన బండ్లగణేశ్ సెటైర్స్

Bandla Ganesh Vs Vijayasai : ‘అలా ఎలా వదిలేశావ్.. బాబాయ్..’ మెుదలైన బండ్లగణేశ్ సెటైర్స్
Advertisement

Bandla Ganesh Vs Vijayasai : రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు వైసీపీ సీనియర్‌ నేత విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) చేసిన ప్రకటనపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌(Bandla Ganesh) స్పందించారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం సరైన పద్ధతేనా అంటూ ప్రశ్నించారు.

వైసీపీ సీనియర్‌ నేత విజయసాయి రెడ్డి రాజకీయాలను వదిలేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ ప్రకటనపై స్పందించిన నిర్మాత బండ్ల గణేశ్… అధికారం ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం వదిలి వెళ్ళిపోవడం చాలా మంది రాజకీయ నాయకులకి ఫ్యాషన్ అయిపోయింది ,ఇది ధర్మమా……! అంటూ ప్రశ్నించారు.

Advertisement

విజయసాయి రెడ్డితో బండ్ల గణేష్ కు ఎన్నో ఏళ్ల నుంచి విభేదాలు ఉన్నాయి. వీరిద్దరూ పలు సందర్భాల్లో నేరుగానే విమర్శలు గుప్పించుకున్నారు. ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా ఒకరి మీద మరొకరు విమర్శలకు దిగారు. తాజాగా విజయసాయిరెడ్డి ప్రకటనతో మరోసారి బండ్ల గణేశ్ మాటల తూటాలు విసిరారు.

ALSO READ : సాయి రెడ్డి ‘రాజీ’ పడ లేక రాజీనామా? జగన్ విదేశాల్లో ఉండగానే ప్రకటన ఎందుకో?

Advertisement

ఇక రాజకీయాలకు దూరం అవుతున్నట్టు ప్రకటించిన విజయసాయిరెడ్డి.. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.

నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా.

ALSO READ : జగన్ కు భారీ షాక్.. రాజకీయాలకు విజయసాయి రెడ్డి గుడ్ బై!

దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను..” అంటూ ట్విట్టర్ లో తెలిపారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×