BigTV English

Mangalagiri : మంగళగిరిలో బాప్టిజం ఘాట్.. బీజేపీ ఎంట్రీతో రచ్చ రంబోలా.. హైకోర్టు స్టే..

Mangalagiri : మంగళగిరిలో బాప్టిజం ఘాట్.. బీజేపీ ఎంట్రీతో రచ్చ రంబోలా.. హైకోర్టు స్టే..
 Mangalagiri

Mangalagiri : ప్రశాంతంగా ఉండే మంగళగిరిలో ప్రస్తుతం కులాల కుంపటి రాజుకుంటోంది. గతంలో కనీసం రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ ఎక్కడ లేని ఓ కార్యాచరణకు అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రీకారం చూట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. అతని ఆదేశాలతో అధికారులు చేసిన పని విమర్శలు, వివాదాలకు కారణమవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.


మంగళగిరిలోని బాప్టిజం ఘాట్ విషయంలో ఆది నుంచి వివాదాలు నడుస్తున్నాయి. గతంలో మత మార్పిడి కోసం ఏదైనా నదిలో కాని.. పారుతున్న కాల్వలో కాని బాప్టిజం చేసేవారు. ఆ తర్వాత క్రిస్టియన్‌ మతంలోకి తీసుకునే వారు. కొన్నిసార్లు నదీ స్నానాల విషయంలో వివాదాలు తలెత్తాయి. బాప్టిజం చేసే వారికి ఇతర మతాల వారికి గొడవలు జరిగేవి. ఘర్షణ వాతావరణం ఏర్పడేది. వివాదాలు ముదిరి అరెస్టుల వరకు వెళ్లిన ధాఖలాలు ఉన్నాయి.

తాజాగా ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే వ్యక్తి బాప్టిజం ఘాట్ కావాలని అడిగారట. అంతే దాన్ని కార్యాచరణలోకి తీసుకుని చట్ట ప్రకారం నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు సమీపంలో స్థలం కేటాయించాలని అధికారులకు అదేశాలు వెళ్లాయి. సదరు వ్యక్తులు కూడా అర్జీ పెట్టుకోవడంతో స్థలం కేటాయించడం చకచకా జరిగిపోయాయి. అప్పటి వరకు రహస్యంగా పనులు జరిగాయి. అసలు విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నేతలు, హిందు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి.


గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న వివాదం మరింత ముదిరింది. బీజేపీ నేతలు ఘాట్ నిర్మాణం కోసం వేసిన పిల్లర్లను తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో స్వల్ప వివాదం తీవ్ర స్థాయిలోకి చేరింది. దానిపై స్థానిక క్రైస్తవులు ఎమ్మెల్యేకు విషయం చేరవేశారట. అంతే పోలీస్ బలగాలు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఘాట్ పనులను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికార పార్టీ ప్రజాప్రతినిధి హెచ్చరించారు. రెండు రోజుల క్రితం జరిగిన పరిణామాల తర్వాత బీజేపీ నేతలు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. అది కూడా బెడిసి కొట్టింది. దీంతో బీజేపీ నేతలకు ఆగ్రహం మరింత పెరిగి నేరుగా కమిషనర్, ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగిస్తే ప్రభుత్వం, అధికారులు, స్థానిక ఎమ్మెల్యే తీరుపై పోరాటం తప్పదని హెచ్చరించారు. పనులు ఆపకపోతే ఘాట్‌ను కూల్చటం ఖాయమని హెచ్చరించారు.

బాప్టిజం ఘాట్ విషయంలో బీజేపీ నేతలు కావాలనే రాద్దాంతం చెస్తున్నారని క్రైస్తవులు విమర్శలు చేస్తున్నారు. బాప్టిజం అంటే తెలియని వాళ్లు మత మార్పిడి అనటం అవివేకం అంటున్నారు. కావాలనే ఘాట్ పనులను అడ్డుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు. దేవుని కృపను చూపించిన వారికి వారి మనస్సును మాత్రమే మార్చుకోవటానికి ఘాట్ పనులను చేపట్టామని అంటున్నారు. బీజేపీ నేతలు ఆరోపిస్తునట్టు మత మార్పిడికి కాదని అంటున్నారు. ఏది ఏమైనా ఖచ్చితంగా ఘాట్ నిర్మించి తీరతామని క్రిస్టియన్‌ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

కుల, మతాలు వంటి సున్నితమైన అంశాల్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. రెండు మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఎలా నిర్ణయాలు తీసుకుంటారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా ఒక మతాన్ని సపోర్ట్‌ చేసేలా అధికారులకు ఆదేశాలు ఎలా ఇస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

వివాదం ముదిరి హైకోర్టుకు చేరింది. మంగళగిరిలో బాప్టిజం ఘాట్‌ నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న బాప్టిజం ఘాట్ నిలిపివేతకు ఆదేశాలు జారీ చేసింది. బాప్టిజం ఘాట్‌ నిర్మాణాన్ని నిలిపివేయాలని హిందూ సంఘాల నేతలు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఘాట్ నిర్మాణంపై స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×