E-Paper
Advertisement

భోగాపురం ఎయిర్‌పోర్ట్ తెచ్చింది జగనే.. మాజీ మంత్రి ధర్మాన కామెంట్స్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ తెచ్చింది జగనే.. మాజీ మంత్రి ధర్మాన కామెంట్స్
Advertisement

Dharmana: మరో మూడు రోజుల్లో ప్రారంభంకానుంది భోగాపురం ఎయిర్ పోర్టు. ఇప్పుడు దాని చుట్టూ కొత్త రాజకీయాలు మొదలయ్యాయి. దాని క్రెడిట్‌ని తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది వైసీపీ. ఈ నేపథ్యంలో వైసీపీ మాటల మాంత్రికుడు ధర్మాన రంగంలోకి దిగారు. ఈ క్రమంలో హాట్ కామెంట్స్ చేశారు.

భోగాపురం ఎయిర్ పోర్టు చుట్టూ కొత్త రాజకీయాలు-ఆగష్టు ఒకటిన భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుంది. గడిచిన నాలుగు రోజులుగా కూటమి ప్రభుత్వానికి చెందిన మంత్రులు అక్కడి ఏర్పాట్లు పర్యవేక్షిస్తోంది. ఓపెనింగ్ కార్యక్రమానికి భారీగా జరపాలని భావించింది. ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది వైసీపీ. ఈ వ్యవహారంపై నోరు విప్పారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. భోగాపురం ఎయిర్‌పోర్టు ఘటన వైసీపీ అధినేత జగన్‌కు దక్కుతుందని ఆయన తేల్చేశారు.

Advertisement

క్రెడిట్ పాలసీపై వైసీపీ దృష్టి-అసలు ఉత్తరాంధ్ర ప్రజలకు కోసం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన జగన్ చేశారని తేల్చేశారు. 2026లో అందుబాటులోకి వస్తుందని, జూన్ నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని ఆనాడే జగన్ చెప్పారని గుర్తు చేశారు. బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎయిర్‌పోర్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వైసీపీ హయాంలో జరిగిందన్నారు. చివరకు ఎన్ఓసీ అనుమతులు జగన్ తీసుకొచ్చారంటూ క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారాయన.

భోగాపురం క్రెడిట్ జగన్‌దేనన్న ధర్మాన-అన్నిరకాల అనుమతులు వచ్చిన తర్వాత ఆనాటి సీఎం జగన్ దీనికి శంకుస్థాపన చేశారన్నారు. తాజాగా భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించాన్ని వైసీపీ స్వాగతిస్తుందనప్నారు. ఎయిర్‌పోర్టు తాము తెచ్చినట్టు చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు చేసింది ఏమీ లేదని, భోగాపురం ఎయిర్ పోర్ట్ కోసం అప్పట్లో జగన్ రూ. 1200 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. చివరకు ఎయిర్‌పోర్టుకు సీడ్ యాక్సెస్ రోడ్స్ జగన్ హయాంలో వచ్చిందని, జగన్ విజ్ఞప్తి మేరకు సీడ్ యాక్సెస్ రోడ్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందన్నారు.

Advertisement

ALSO READ: మహిళా కోర్టు తలుపు తట్టిన జోగి కుటుంబం.. అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ పిటిషన్లు!

ఉత్తరాంధ్ర ప్రజల డబ్బు అమరావతిలో ఖర్చు- వేరువారు చేసిన పనిని తన పనిగా చెప్పుకోవడం సీఎం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. అప్పట్లో వైసీపీ తెచ్చిన ORR ను చంద్రబాబు తీవ్రంగా విమర్శించే వారని, ఇప్పుడు తాను తెచ్చినట్లుగా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు. చివరలో మరొక పాయింట్ చెప్పారు ధర్మాన. ఉత్తరాంధ్ర ప్రజల డబ్బును అమరావతిలో సీఎం చంద్రబాబు ఖర్చు చేస్తున్నారంటూ కొత్త పల్లవి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తీరు వల్ల మళ్ళీ విభజన వాదం తలెత్తే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని హితవు పలికారు.

Related News

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

Big Stories

Advertisement
×