LG AI Direct Drive Washing Machine: పూర్వం రోజుల్లో బట్టలు ఉతకడం అంటే పెద్ద సమస్య. కానీ ఇప్పుడు స్మార్ట్ టెక్నాలజీ వల్ల ఆ శ్రమ చాలా తగ్గింది. ముఖ్యంగా ఏఐ తీసుకొచ్చిన ఏఐ డైరెక్ట్ డ్రైవ్, స్టీమ్ వాష్ టెక్నాలజీలు బట్టల నాణ్యత తగ్గకుండా, మురికిని, 99.9% అలర్జీ కలిగించే బ్యాక్టీరియాను సమర్థవంతంగా తొలగిస్తాయి. అంతేకాకుండా.. ఎక్కువ స్పిన్ స్పీడ్ వల్ల బట్టలు త్వరగా ఆరిపోతాయి. మిమ్మల్ని మెప్పించే టాప్ 5 ఎల్ ఈ వాషింగ్ మెషీన్ల వివరాలు, ధరలు ఇప్పుడు చూద్దాం.
మీ బట్టల ఫ్యాబ్రిక్‌ను బట్టి తానంతట తానే వాషింగ్ సైకిల్‌ను అడ్జస్ట్ చేసుకునే ఏఐ డైరెక్ట్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తున్న బెస్ట్ మోడల్స్ ఇవే..
మీ ఇంట్లో 3 నుంచి 4 మంది సభ్యులు ఉంటే ఈ 8 కేజీల వాషింగ్ మెషీన్ సరిగ్గా సరిపోతుంది. ఇందులో ఉన్న ఏఐ డీడీ టెక్నాలజీ బట్టల బరువును, ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నెస్‌ను గుర్తించి దానికి తగ్గట్టుగా డ్రమ్ మూవ్‌మెంట్‌ను ప్లాన్ చేస్తుంది. 1400 RPM హై స్పిన్ స్పీడ్ ఉండటం వల్ల నీటిని వేగంగా పిండి బయటకు పంపుతుంది. స్టీమ్ వాష్ వల్ల చిన్నపిల్లల బట్టలపై ఉండే కంటికి కనిపించని అలర్జెన్లు తొలగిపోతాయి.
ధర: రూ.36,990 నుంచి రూ. 39,000 వరకు ఉంటుంది.
పెద్ద కుటుంబాల కోసం 9 కేజీల కెపాసిటీ ఉన్న ఈ మోడల్ చాలా పర్ఫెక్ట్ . ఇది స్మార్ట్ ThinQ ఆప్షన్‌తో వస్తుంది. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా దీనిని కంట్రోల్ చేయవచ్చు. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. దీని వల్ల కేవలం 39 నిమిషాల్లోనే బట్టలు ఉతికి ఆరబెట్టేస్తుంది. 1400 RPM స్పీడ్, స్టీమ్ ఫీచర్ మీ బట్టలను ఎప్పుడూ కొత్తవిగా ఉంచుతాయి.
ధర: రూ.42,990 నుంచి రూ. 46,000 వరకు ఉంటుంది.
చిన్న కుటుంబాలకు లేదా కపుల్స్‌కు 7 కేజీల వాషింగ్ మెషీన్ బెస్ట్ ఆప్షన్. తక్కువ కరెంట్, తక్కువ నీటి వాడకంతో పని చేస్తూనే బెస్ట్ వాషింగ్ క్వాలిటీని ఇస్తుంది. 1200 RPM స్పిన్ స్పీడ్ ఉండటం వల్ల వర్షా కాలంలో కూడా బట్టలు త్వరగా ఆరిపోతాయి. 6 మోషన్ డీడీ టెక్నాలజీ బట్టలను వేర్వేరు కోణాల్లో తిప్పుతూ చేతితో ఉతికిన ఫీల్ ఇస్తుంది.
ధర: రూ.30,990 నుంచి రూ. 33,500 వరకు ఉంటుంది.
ఎక్కువ బట్టలు ఒకేసారి ఉతకాలన్నా లేదా బెడ్ షీట్లు, దుప్పట్లు ఉతకాలన్నా ఈ 10 కేజీల మోడల్ సూపర్ ఛాయిస్. ఇది హెవీ డ్యూటీ వాషింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఇందులో ఉన్న అలర్జీ కేర్ స్టీమ్ వాష్ మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 1400 RPM స్పిన్ స్పీడ్‌తో పాటు ఇందులో ఉండే ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ మోటార్ సౌండ్ , వైబ్రేషన్ లేకుండా పని చేస్తుంది.
ధర: రూ.48,990 నుంచి రూ.53,000 వరకు ఉంటుంది.
Also Read: స్మార్ట్ ఫీచర్స్,ఎక్కువ స్పేస్! మీ ఇంటికి తగ్గ డబుల్ డోర్ ఫ్రిజ్‌లు
మీ ఇంటి దగ్గర బట్టలు ఆరేయడానికి సరైన స్థలం లేదా బాల్కనీ లేదా? అయితే ఈ వాషర్, డ్రైయర్ కాంబో మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది బట్టలను ఉతకడమే కాకుండా 100% ఆరబెడుతుంది. 1400 RPM స్పిన్ స్పీడ్, ఏఐ డీడీ స్టీమ్ ఫీచర్లతో పాటు ఇది ఉతికిన వెంటనే బట్టలను నేరుగా తొడుక్కునేలా ఆరబెట్టి ఇస్తుంది.
ధర: రూ.54,990 నుంచి రూ.59,000 వరకు ఉంటుంది.
ఫ్యాబ్రిక్ :ఏఐ డీడీ టెక్నాలజీ వల్ల బట్టల దారాలు పాడవకుండా దాదాపు 18% సేఫ్టీ లభిస్తుంది.
బ్యాక్టీరియా: స్టీమ్ వాష్ ఆవిరి ద్వారా ఉతుకుతుంది కాబట్టి ఇన్ఫెక్షన్ల భయం ఉండదు.
కరెంట్ ఆదా: 5-స్టార్ రేటింగ్ ఉన్న మోడల్స్ వల్ల కరెంట్ బిల్లు తగ్గుతుంది.