Telangana Politics: రాజకీయాలు ఎప్పుడు, ఎలా టర్న్ అవుతాయో చెప్పలేదు. అప్పటికప్పుడు నేతల మధ్య గొడవలు.. ఆ తర్వాత కలిసిపోయిన సందర్భాలు ఉంటాయి. తాజాగా మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆమె వరంగల్‌లో తన వర్గీయులతో భేటీ అయ్యారు. అందులో తీసుకున్న ప్రకారం అడుగులు వేయనున్నారు. ఆదివారం సాయంత్రం ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. అసలు ఏం జరుగుతోంది?
మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ తర్వాత తన సొంత జిల్లా వరంగల్‌కు వచ్చారు మాజీ మంత్రి కొండా సురేఖ. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలకు ఆమె హాజరుకాలేదు. దీనిపై కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. పార్టీలో జరిగిన పరిణామాలపై మీనాక్షి ఈ సందర్భంగా ఆరా తీశారు. ఈ క్రమంలో ఆమె పార్టీ మారుతున్నారా? అనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
శనివారం హైదరాబాద్ నుంచి నేరుగా తన జిల్లా వరంగల్‌కు ఆమె చేరుకున్నారు. ఆదివారం ఉదయం అభిమానులు, పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. మంత్రి వర్గం తర్వాత జరిగిన పరిణామాలపై ఆమె అనుచరులతో చర్చించారు. ఢిల్లీ నుంచి అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత ఆమె వరంగల్‌కు రావడం, అనుచరులతో భేటీ వెనుక ఏం జరుగుతోంది? గడిచిన రెండురోజులుగా బీసీ సంఘాలతో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించిన తర్వాత బీసీ వాదం కోసం తన కార్యాచరణ చేపట్టాలని ఆయా సంఘాలు భావిస్తున్నట్లు సమాచారం.
ALSO READ: హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు.. కొత్త బీఎండబ్ల్యూ కారుని చుట్టి ముట్టి, రూ2. లక్షలు డిమాండ్
వారిని కొన్నాళ్లు సైలెంట్ గా ఉండాలని ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. తాము బయటకు వచ్చి మాట్లాడే వరకు ఎవరూ మాట్లాడకూడదని చెప్పినట్టు వార్తలు లేకపోలేదు. అందుకే బీసీ నేతలు సైలెంట్ అయ్యారని అనుకుంటున్నారు. బీసీ సంఘాలతో కలిసి ఏదైనా ప్రకటన చేయనున్నారా? లేకుంటే పార్టీ మార్పుపై ఏదైనా నిర్ణయం చెబుతారా? కొండా సురేఖ వైఖరిపై సాయంత్రానికి క్లారిటీ రావచ్చని నేతలు అంటున్నారు.