E-Paper
Advertisement

400 మంది కొత్త ప్లేయర్లను తీసుకోని, పాకిస్తాన్ జట్టును తయారు చేయండి

400 మంది కొత్త ప్లేయర్లను తీసుకోని, పాకిస్తాన్ జట్టును తయారు చేయండి
Advertisement

Shoaib Akhtar On PCB:  ఇంగ్లాండ్ గడ్డపై వైట్ వాష్ అయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టును ( Pakistan Cricket Team) ఉద్దేశించి దారుణంగా విమర్శలు చేస్తున్నారు. ఒక్కడికి కూడా గెలవాలన్న కసి కనిపించలేదని.. ఈ క్రమంలోనే మూడు టెస్టుల్లో పాకిస్తాన్ అత్యంత దారుణంగా ఓడిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) కూడా ఈ అంశంపై స్పందించారు. మూడవ టెస్ట్ కంటే ముందు ఏడుగురు క్రికెటర్లను పక్కకు పెట్టారు కదా..? ఏడుగురిని కాదు, మొత్తం జట్టులో ఉన్న 11 మందిని మార్చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా 300 నుంచి 400 మంది కొత్త క్రికెటర్లను తీసుకొని.. నయా పాకిస్తాన్ క్రికెట్ జట్టును తయారు చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు (PCB) సూచనలు చేశారు. కొత్త క్రికెటర్లు వస్తేనే పాకిస్తాన్ తలరాత మారుతుందని వ్యాఖ్యానించారు షోయబ్ అక్తర్. ఈ క్రమంలో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

400 మంది కొత్త ప్లేయర్లను తీసుకోని, పాకిస్తాన్ జట్టును తయారు చేయండి

ఇంగ్లాండ్ గడ్డపై దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టును ఉద్దేశించి మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్న పాకిస్తాన్ టెస్ట్ జట్టులో ఆడాలనే కసి కనిపించడం లేదని విమర్శలు చేశారు. రెండు టెస్టుల్లో ఓడిపోయిన తర్వాత ఏడుగురు క్రికెటర్లను పక్కకు పెట్టారు.. కానీ 11 మందిని తొలగించి కొత్త వాళ్లను ఆడించి ఉంటే, మూడో టెస్టులో గెలిచే వాళ్ళం అంటూ పేర్కొన్నారు. కానీ ఆ పరిస్థితి చేయి దాటిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత సీనియర్ జట్టుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆశలు వదిలేస్తుందని ఓ అధికారి తనతో చెప్పినట్లు కూడా షోయబ్ అక్తర్ వెల్లడించారు.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

రాబోయే 6 లేదా 7 నెలల్లో దాదాపు 300 నుంచి 400 మంది యువ క్రికెటర్లను సెలెక్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయని కూడా ఆయన వివరించారు. ఇందులో మెరుగైన ప్లేయర్లను సిద్ధం చేసి.. నయా పాకిస్తాన్ క్రికెట్ జట్టును తయారు చేసే విధంగా పిసిబి అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. అప్పుడే పాకిస్తాన్ క్రికెట్ జట్టు విదేశీ గడ్డలపై కూడా రాణించే ఛాన్సులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ క్రికెట్ జట్టు వెంటిలేటర్ పైన ఉందని… పూర్వ వైభవం రావడానికి కనీసం రెండు లేదా మూడు సంవత్సరాల సమయం పడుతుందని కుండ బద్దలు కొట్టి చెప్పారు షోయబ్ అక్తర్.

ఆ ముగ్గురు క్రికెటర్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కాపాడుకోవాలి

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ జట్టును కొత్తగా తయారు చేస్తున్న నేపథ్యంలో షాహిన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్ లాంటి క్రికెటర్లను మాత్రం కాపాడుకోవాలని సూచనలు చేశారు. ఈ ముగ్గురు పాకిస్తాన్ జట్టులో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. అప్పుడే జట్టు మరింత బలంగా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు.

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

Related News

40 ఏళ్ళ రోహిత్ ను తీసుకున్నప్పుడు, షమీని ఉగ్రవాదిలా ఎందుకు ట్రీట్ చూస్తున్నారు ?

కోచ్ వహాబ్ రియాజ్ తో పాకిస్తాన్ లేడీ క్రికెటర్ డేటింగ్…స్టేడియంలోనే రొమాన్స్ !

డ్రెస్సింగ్ రూమ్ వైపు దొంగ చూపులు చూసి రివ్యూలు తీసుకునేవారు – పుజారా

గంగూలీ క్రికెట్ కు పనికిరాడంటూ మెయిల్…గ్రెగ్ చాపెల్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఫ్యాన్స్

ఒరేయ్ నఖ్వీ… నీకు ఏది చేతకాదు కానీ, ఆసియా కప్ అయినా దొంగిలించు !

ఆస్ట్రేలియాకు వెళ్ళాక టీమిండియా నుంచి ధోని తరిమేశాడు..సెహ్వాగ్ సంచలనం !

వహాబ్ రియాజ్ కోచ్ కాదు…వాడు పెద్ద కామాంధుడు, డ్రెస్సింగ్ రూమ్ లోనూ వదలడు !

Big Stories

Advertisement
×