Mobile Battery Tips: రోజంతా ఫోన్‌ను పెద్దగా ఉపయోగించకపోయినా సాయంత్రం అయ్యేసరికి బ్యాటరీ ఖాళీ అయిపోవడం చాలామందికి ఎదురయ్యే సమస్యే. ముఖ్యమైన పని మధ్యలో ఉన్నప్పుడో, ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడో ఇలా బ్యాటరీ అయిపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని సింపుల్ సెట్టింగ్స్‌ను మార్చుకోవడం ద్వారా స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను గణనీయంగా పెంచుకోవచ్చు. అసలు ఆ సెట్టింగ్స్ ఏంటి? వాటిని ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
మన ఫోన్‌లో బ్యాటరీని ఎక్కువగా తినేది డిస్‌ప్లేనే. అందుకే బ్రైట్‌నెస్ ఎప్పుడూ అవసరానికి మించి పెట్టుకోకూడదు. ఆటో బ్రైట్‌నెస్ ఆన్ చేసుకుంటే.. మన చుట్టూ ఉన్న వెలుతురును బట్టి ఫోనే దాన్ని సర్దుకుంటుంది. అలాగే స్క్రీన్ టైమ్ అవుట్ సమయాన్ని 30 సెకన్లకు తగ్గిస్తే మరింత మంచిది.
Also Read: పవర్‌ఫుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ.. Sony Xperia 1 IX లోని స్పెషల్ ఫీచర్లు ఇవే!
జీపీఎస్ లేదా లొకేషన్ సేవలు చాలా యాప్స్ బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అవుతూ బ్యాటరీని ఖాళీ చేస్తుంటాయి. పని అయిపోయాక లొకేషన్, బ్లూటూత్, వైఫైలను ఆపేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల అనవసరంగా బ్యాటరీ ఖర్చు కాకుండా ఉంటుంది.
మనం వాడని చాలా యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంటర్నెట్‌ను వాడుకుంటూ బ్యాటరీని లాగేస్తుంటాయి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఆన్ చేస్తే.. వాడని యాప్స్ బ్యాటరీని వాడకుండా ఫోనే ఆటోమేటిక్‌గా అడ్డుకుంటుంది.
ముఖ్యంగా అమోలెడ్ డిస్‌ప్లే ఉన్న ఫోన్లలో డార్క్ మోడ్ వాడితే బ్యాటరీ చాలా వరకు ఆదా అవుతుంది. నెక్స్ట్ టైమ్ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది అనుకున్నప్పుడు ఈ చిన్న సెట్టింగ్స్ మార్చి చూడండి.. మీకే తేడా స్పష్టంగా తెలుస్తుంది.
Also Read: Galaxy Watch 4, Classic యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు!