BigTV English

Kanigiri Assembly Constituency : స్వింగ్ ఓటర్లే కీలకమా ? కనిగిరి కింగ్ అయ్యేదెవరు?

Kanigiri Assembly Constituency : స్వింగ్ ఓటర్లే కీలకమా ? కనిగిరి కింగ్ అయ్యేదెవరు?
Kanigiri Assembly Constituency

Kanigiri Assembly Constituency : కనిగిరి సహజ పర్యావరణ అందాలకు పెట్టింది పేరు. ఇక్కడి రాజకీయాలు ప్రశాంతంగానే సాగుతుంటాయి. నమ్ముకున్న వారిని ఇక్కడి ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించిన సందర్భాలున్నాయి. అయితే ఈసారి చాలా రాజకీయ పరిణామాలు మారాయి. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ ను వైసీపీ తప్పించడం కీలక పరిణామంగా మారింది. అదే సమయంలో టీడీపీ నుంచి గత అభ్యర్థి బరిలో దిగబోతున్నారు. మరి ఇప్పుడు మారిన సమీకరణాల నేపథ్యంలో కనిగిరి నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

బుర్రా మధుసూధన్ యాదవ్ (వైసీపీ గెలుపు) VS ఉగ్రనర్సింహారెడ్డి (టీడీపీ)


2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ ఏకంగా 58 శాతం ఓట్లు సాధించి కనిగిరిలో తిరుగులేని విజయం సాధించారు. జగన్ వేవ్ చాలా గట్టిగా పని చేసింది. అలాగే 2014లో ఓడిన సానుభూతి కూడా వర్కవుట్ అయింది. భారీగా ఓట్లు రాబట్టింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి ఉగ్రనర్సింహారెడ్డికి 37 శాతం ఓట్లు పడ్డాయి. అయితే ఓట్లు తగ్గడానికి ప్రధాన కారణం.. కదిరి బాబూరావును వేరే సెగ్మెంట్ కు పంపడంతో ఆయనకు చెందిన మద్దతుదారులు ఉగ్రనర్సింహారెడ్డికి పూర్తిస్థాయిలో సపోర్ట్ ఇవ్వలేదంటున్నారు. మరి ఈసారి ఎన్నికల్లో కనిగిరి సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

దద్దాల నారాయణ యాదవ్ (YCP) ప్లస్ పాయింట్స్

కనిగిరి వ్యాప్తంగా ప్రచార జోరు పెంచడం

క్యాడర్ తో మరింత సత్సంబంధాలు

సమస్యల పరిష్కారంపై భరోసా ఇవ్వడం

దద్దాల నారాయణ యాదవ్ మైనస్ పాయింట్స్

కనిగిరి వైసీపీలో వర్గ విబేధాలు

కనిగిరి సెగ్మెంట్ లో పెరిగిన నీటి సమస్య

ఇండస్ట్రియల్ పార్క్ హామీ నెరవేరకపోవడం

సెగ్మెంట్ లో అధ్వాన్నంగా మారిన రోడ్లు

డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక వర్షాకాలంలో రోడ్లపైనే మురుగు

2011 నుంచి పట్టాలెక్కని నిమ్జ్ జోన్ ప్రతిష్ఠాపన హామీ

కనిగిరి ట్రిపుల్ ఐటీ కాలేజ్ కలగానే మిగిలిపోవడం

ఉగ్రనర్సింహారెడ్డి (TDP) ప్లస్ పాయింట్స్

కనిగిరిలో సీనియర్ నేతగా గుర్తింపు

గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి

టీడీపీ క్యాడర్ లో పాజిటివ్ ఇమేజ్

విద్యార్థి దశ నుంచే యాక్టివ్ పాలిటిక్స్

టీడీపీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం

వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ కొత్త కావడం

ఉగ్రనర్సింహారెడ్డి మైనస్ పాయింట్స్

అధికార పార్టీ అభ్యర్థిని ఏమేరకు అడ్డుకుంటారన్న డౌట్లు

ఇక వచ్చే ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

దద్దాల నారాయణ యాదవ్ VS ఉగ్రనర్సింహారెడ్డి

ఇప్పటికిప్పుడు కనిగిరిలో ఎన్నికలు జరిగితే.. తెలుగుదేశం పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ అభ్యర్థికి 48 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉండగా, వైసీపీ అభ్యర్థి నారాయణ యాదవ్ కు 46 శాతం ఓట్లు, ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేనతో పొత్తు టీడీపీకి మరింతగా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ తో పోలిస్తే టీడీపీ అభ్యర్థి ఉగ్రనర్సింహారెడ్డి కనిగిరిలో బలమైన నేతగా ఉన్నారు. ఆయన ట్రాక్ రికార్డు కూడా బాగానే ఉంది. మరోవైపు ప్రభుత్వ సహజ వ్యతిరేకత కూడా టీడీపీకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది.

అటు వైసీపీ అభ్యర్థికి వచ్చే ఓట్ షేర్ ప్రభుత్వ లబ్దిదారుల నుంచే అని తెలుస్తోంది. మరోవైపు దద్దాల నారాయణకు కీలక రెడ్డి నాయకులైన బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి సపోర్ట్ కీలకంగా మారుతోంది. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా కేవలం 2 శాతం మాత్రమే ఉంది. అంటే కనిగిరి అసెంబ్లీ సీటుకు టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల నాటికి గెలుపోటములు ఎటువైపైనా టర్న్ అయ్యే అవకాశాలున్నాయి. స్వింగ్ ఓటర్లు, తటస్థ ఓటర్లు కనిగిరిలో రాబోయే ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారే ఛాన్సెస్ కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది.

Related News

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Big Stories

×