BigTV English

King Charles III: బ్రిటన్ రాజకుటుంబానికి ఏమైంది?

King Charles III: బ్రిటన్ రాజకుటుంబానికి ఏమైంది?
King Charles III

King Charles III (international news in telugu):


బ్రిటన్ సార్వభౌమాధికారం దక్కడానికి ఏడు దశాబ్దాలకు పైగా సమయం పట్టింది కింగ్ చార్లెస్‌కు. గద్దె‌ ఎక్కి పట్టుమని ఏడాదిన్నర కాలేదు. అంతలోనే పిడుగులాంటి వార్త. 75 ఏళ్ల రాజు చార్లెస్‌-3ను మృత్యువు కేన్సర్ రూపంలో తరుముకొస్తోందని. ప్రొస్టేట్‌కు చికిత్స తీసుకుని ఆస్పత్రి నుంచి బయటకొచ్చిన నాలుగు రోజులకు ప్యాలెస్ వర్గాలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. అయితే అది ఏ రకమైన కేన్సర్ అన్నదీ వెల్లడించకున్నప్పటికీ.. చికిత్స పూర్తి చేసుకుని సాధారణ విధుల్లోకి వస్తారని పేర్కొన్నాయి. ఆయన హాజరు కావాల్సిన కార్యక్రమాలకు ప్రస్తుతం రాజకుటుంబంలోని సీనియర్లు వెళ్తారని ఆ వర్గాలు వివరించాయి.

వాస్తవానికి ఆరోగ్య సమస్యల కారణంగారాజకుటుంబం విచిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకుంది. ఎందుకంటే ఆ కుటుంబసభ్యల్లో అత్యంత సీనియర్లు అయిన ముగ్గురు
రాయల్స్ ఇప్పుడు సాధారణ విధులకు దూరమయ్యారు. కింగ్ చార్లెస్ డిశ్చార్జికి కొన్ని గంటల ముందే ఆయన కోడలు కేథరిన్ శస్త్రచికిత్స చేయించుకుని ఆస్పత్రి
నుంచి బయటకు వచ్చారు. కేథరిన్‌కు సపర్యలు చేసేందుకు ఆమె భర్త విలియమ్ కూడా ప్రజలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.


రాజు తరఫున కార్యక్రమాలకు హాజరయ్యేది వర్కింగ్ రాయల్స్ మాత్రమే. నిరుడు 2710 కార్యక్రమాలను ఆ వర్కింగ్ రాయల్స్ గ్రూప్ చూసుకుంది. రాజకుటుంబంలోని 14 మంది ఆ గ్రూప్‌లో ఉన్నారు. కింగ్ చార్లెస్, క్వీన్ కెమిల్లా, యువరాణి ఎనా,
యువరాజు ఆండ్రూ, డ్యూక్-డచెస్ ఆఫ్ ఎడిన్‌బరో , వేల్సెస్, ససెక్సెస్,
డ్యూక్-డచెస్ ఆఫ్ గ్లాస్టర్, డ్యూక్-డచెస్ ఆఫ్ కెంట్ వారిలో ఉన్నారు. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ రాచరికపు హోదాను త్యజించడం, లైంగిక సంబంధాల ఆరోపణలతో
ఆండ్రూ బలవంతంగా తప్పుకోవాల్సి రావడంతో ఆ గ్రూప్ సభ్యుల సంఖ్య
11కి పరిమితమైంది. వారిలో సగం మందికిపైగా 70 ఏళ్ల వయసు
పైబడినవారే.

దీంతో అందుబాటులో ఉన్న కొద్ది మంది మాత్రమే అధికార విధులు, కార్యక్రమాలను
చూసుకోవాల్సిన పరిస్థితుల్లో రాజకుటుంబంపై మునపెన్నడూ లేనంత ఒత్తిడి పెరిగింది. తాజాగా రాజు చార్లెస్ కేన్సర్ బారిన పడ్డారన్న వార్త బ్రిటన్లను ఆందోళనకు గురిచేస్తోంది.

Tags

Related News

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Terroist Masood Azhar: మసూద్ టార్గెట్ రూ.120 కోట్లు.. గ్లోబల్ టెర్రరిస్ట్‌కి విరాళాలు ఇస్తుంది ఎవరంటే..?

New York Bus Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Big Stories

×