BigTV English

Mandapeta Assembly constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. మండపేటలో టీడీపీ హవా కొనసాగేనా?

Mandapeta Assembly constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. మండపేటలో టీడీపీ హవా కొనసాగేనా?
AP politics

Mandapeta Assembly constituency(AP politics): మండపేట నియోజకవర్గం గతంలో వేర్వేరు సెగ్మెంట్లలో ఉండి 2009 నుంచి ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది. 1952 నుంచి 1972 వరకు పామూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఉండగా, ఆ తర్వాతి నుంచి 2009 వరకు ఆలమూరు నియోజకవర్గంలో భాగంగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009 నుంచి మండపేట సెపరేట్ సెగ్మెంట్‌గా మారిపోయింది. మండపేట సెగ్మెంట్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి ఇక్కడ టీడీపీ హవానే నడుస్తోంది. వేగుళ్ల జోగేశ్వరరావు వరుసగా మూడుసార్లు గెలుస్తూ వచ్చారు. మరి ఈసారి మండపేట నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

పిల్లి సుభాష్ చంద్రబోస్ VS వేగుళ్ల జోగేశ్వరరావు (టీడీపీ గెలుపు)


2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ 36 శాతం ఓట్లు సాధించారు. టీడీపీ అభ్యర్థి 42 శాతం ఓట్లు, జనసేనకు 19 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులు 3 శాతం ఓట్లు సాధించారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వేవ్ ఉన్నా.. టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు విజయం సాధించారు. ఇందుకు కారణం ఆయనపై ఉన్న పాజిటివ్ ఇమేజ్. మండపేట సెగ్మెంట్ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే. జనసేన అభ్యర్థిగా వేగుళ్ల లీలా కృష్ణ పోటీ చేసి 18 శాతం ఓట్ షేర్ సాధించినా టీడీపీకి ఈ సెగ్మెంట్ లో ఇబ్బంది రాలేదు. మరి ఈసారి ఎన్నికల్లో మండపేట సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

Read More: Nuzividu Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. నూజివీడులో ఓటర్లు ఎవరికి పట్టం కడతారు ?

తోట త్రిమూర్తులు ( YCP )ప్లస్ పాయింట్స్

  • సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా పేరు
  • మండపేట జనంలో పాజిటివ్ ఇమేజ్
  • సెగ్మెంట్ లో గత ఐదేళ్ల నుంచి యాక్టివ్ గా కార్యకలాపాలు
  • కాపు సామాజికవర్గం మద్దతు

తోట త్రిమూర్తులు మైనస్ పాయింట్స్

  • టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని ఎంత వరకు ఎదుర్కొంటారన్న డౌట్లు

వి.జోగేశ్వరరావు ( TDP ) ప్లస్ పాయింట్స్

  • మండపేటలో జోగేశ్వరరావు తిరుగులేని నేతగా మారడం
  • జోగేశ్వరరావు పేరు ముందే ప్రకటించిన టీడీపీ
  • క్యాడర్ లో ఇమేజ్ పెరగడం

వి.జోగేశ్వరరావు మైనస్ పాయింట్స్

  • మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా అనుకున్నంత స్థాయిలో జరగని అభివృద్ధి
  • జనంలో తగ్గిన ఇమేజ్
  • కేశవపురం గ్రామస్తులకు ఇండ్లు కట్టిస్తానన్న హామీ నెరవేర్చకపోవడం
  • రాజమండ్రి, కాకినాడ, కడియం, రామచంద్రాపురానికి కనెక్టివిటీ రోడ్లు డ్యామేజ్ అవడం
  • సెగ్మెంట్లో రైస్ మిల్స్ ఉన్నా రైతులకు సరైన ధర రాకపోవడం

ఇక వచ్చే ఎన్నికల్లో మండపేట నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

తోట త్రిమూర్తులు VS జోగేశ్వరరావు

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మండపేటలో టీడీపీకి ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు 47 శాతం ఓట్లు, టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావుకు 49 శాతం ఓట్లు, ఇతరులకు 4 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చెప్పాలంటే మండపేటలో గతంలో మాదిరి ఈజీ విక్టరీ ఏ పార్టీకి కనిపించే పరిస్థితి లేదు. టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా ఇప్పటికిప్పుడు చూస్తే 2 శాతం మాత్రమే కనిపిస్తోంది. అంటే టఫ్ ఫైట్ ఖాయమే. టీడీపీ అభ్యర్థి వరుసగా మూడుసార్లు గెలిచారు కాబట్టి ఈసారి సహజ వ్యతిరేకత ఉంటున్నా.. జనసేన పొత్తుతో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మండపేటలో 12 శాతంగా ఉన్న కమ్మ కమ్యూనిటీ ఓట్లు కూడా టీడీపీకే పడే ఛాన్స్ ఉంది. అయితే జోగేశ్వరరావు అభ్యర్థిత్వంపై మండపేట టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు కూడా కాపు కమ్యూనిటీ నేత కావడంతో కాపుల ఓట్లు రెండువైపులా చీలి ఎన్నికల నాటికి ఈక్వేషన్స్ ఎటువైపైనా మారేందుకు ఆస్కారం కనిపిస్తోంది. ఇంకోవైపు మండపేటలో వరుసగా మూడుసార్లు టీడీపీ అభ్యర్థి గెలవడం, అనుకున్నంతగా ఈ సెగ్మెంట్ అభివృద్ధి చెందకపోవడం వంటివి వైసీపీ ఓట్ షేర్ కు కారణంగా సర్వేలో తేలింది.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×