E-Paper
Advertisement

Nuzividu Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. నూజివీడులో ఓటర్లు ఎవరికి పట్టం కడతారు?

Nuzividu Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. నూజివీడులో ఓటర్లు ఎవరికి పట్టం కడతారు?
Advertisement
Andhra pradesh election news

Nuzividu Assembly Constituency(Andhra pradesh election news): నూజివీడు రాజకీయాల్లో మేక కుటుంబానికి చాలా ప్రాధాన్యం ఉంది. నూజివీడు జమిందారు కుటుంబానికి చెందిన మేక రంగయ్య అప్పారావు ఐదుసార్లు వరుసగా గెలిచిన సందర్భం ఉంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కూడా మేక వెంకట ప్రతాప్ అప్పారావు కూడా ఇదే కుటుంబం నుంచి వచ్చారు. నూజివీడు మామిడిపళ్లకు ఫేమస్. నూజివీడు రసాలు, బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు వంటివి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతుంటాయి. దేశంలోనే మ్యాంగో వెరైటీలకు నూజివీడు పెట్టింది పేరు. మరి నూజివీడు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.

2019 RESULTS

Advertisement

మేక వెంకట ప్రతాప్ అప్పారావు VS ముద్దరబోయిన వెంకటేశ్వరరావు

2019 అసెంబ్లీ ఎన్నికల్లో నూజివీడులో వైసీపీ గెలిచింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన మేక వెంకట ప్రతాప్ అప్పారావు 51 శాతం ఓట్లు రాబట్టి గెలిచారు. టీడీపీ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు 43 శాతం ఓట్లు వచ్చాయి. అలాగే జనసేనకు 3 శాతం, ఇతరులకు 3 శాతం చొప్పున ఓట్లు లభించాయి. మేక కుటుంబం ఎఫెక్ట్, వైఎస్ జగన్ పాదయాత్ర ప్రభావం ఇవన్నీ కలిసి వైసీపీ విజయానికి కారణమయ్యాయి. అదే సమయంలో 2014లో ఓడిన ముద్దరబోయిన గత ఎన్నికల ముందు యాక్టివ్ అవడంతో వెనుకబడ్డారన్న టాక్ ఉంది. మరి ఈసారి ఎన్నికల్లో నూజివీడు సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

Advertisement

Read More : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. పొన్నూరు పోల్ వార్ లో విజేత ఎవరు ?

మేక వెంకట ప్రతాప్ అప్పారావు (YCP) ప్లస్ పాయింట్స్

సుదీర్ఘ రాజకీయ వారసత్వం
మేక కుటుంబానికి సెగ్మెంట్ లో మంచి పేరు
గతంలో దానం చేసిన భూములు
సొంత నిధులతో స్కూల్స్, హాస్పిటల్స్ నిర్మాణం
నూజివీడులో 100 పడకల కొత్త హాస్పిటల్ నిర్మాణం

మేక వెంకట ప్రతాప్ అప్పారావు మైనస్ పాయింట్స్

అప్పారావుపై వైసీపీ క్యాడర్ లో పెరిగిన అసంతృప్తి
తమ సమస్యలు పట్టించుకోవడం లేదని జనంలో అసంతృప్తి
రోడ్ల మెయింటెనెన్స్ పట్టించుకోకపోవడం
మామిడి పండ్ల కోసం కోల్డ్ స్టోరేజ్ నిర్మించకపోవడం
మ్యాంగో రీసెర్చ్ యూనిట్ సెంటర్ ను పట్టించుకోకపోవడం
కృష్ణాజిల్లా కాకుండా ఏలూరు జిల్లాలో కలపడంపై జనంలో అసంతృప్తి

ముద్దరబోయిన వెంకటేశ్వరరావు (TDP) ప్లస్ పాయింట్స్

సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ గా గుర్తింపు
వరుసగా రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి
డ్వాక్రా మహిళా సంఘాల మద్దతు
టీడీపీ క్యాడర్ నుంచి సపోర్ట్
ప్రభుత్వంపై ఏర్పడ్డ సహజ వ్యతిరేకత

పార్థసారథి (TDP) ప్లస్ పాయింట్స్

సీనియర్ నాయకుడిగా జనంలో గుర్తింపు

పార్థసారథి మైనస్ పాయింట్స్

పెనమలూరు నుంచి నూజివీడు కలిసి వస్తుందా అన్న డౌట్లు
వైసీపీ నుంచి ఇటీవలే టీడీపీలో చేరడం
టీడీపీ క్యాడర్ నుంచి సపోర్ట్ అందుతుందా అన్న డౌట్లు
ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో కోల్డ్ వార్

Read More : స్వింగ్ ఓటర్లే కీలకమా ? కనిగిరి కింగ్ అయ్యేదెవరు?

పర్వతనేని గంగాధర్ (TDP) ప్లస్ పాయింట్స్

యూత్ లీడర్ గా ఎమర్జ్ అవడం
గత రెండేళ్ల నుంచి సెగ్మెంట్ లో కార్యకలాపాలు
నియోజకవర్గంలో రోజురోజుకు పట్టు పెంచుకోవడం
అన్న క్యాంటీన్ ద్వారా అన్నార్థులకు సహాయం

పర్వతనేని గంగాధర్ మైనస్ పాయింట్స్

రాజకీయాలకు కొత్త కావడం
పార్టీ సీనియర్ల నుంచి సహకారం అందుతుందా అన్న అనుమానం

ఇక వచ్చే ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

మేక వెంకట ప్రతాప్ అప్పారావు వైసీపీ VS ముద్దరబోయిన వెంకటేశ్వరరావు టీడీపీ

ఇప్పటికిప్పుడు నూజివీడులో ఎన్నికలు జరిగి వైసీపీ నుంచి మేక అప్పారావు, టీడీపీ నుంచి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు బరిలో దిగితే టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థి మేక అప్పారావుకు 45 శాతం ఓట్లు, టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వరరావుకు 52 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులకు 3 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. వరుసగా రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి నూజివీడులో వెంకటేశ్వరరావుకు కలిసి వస్తోంది. అలాగే వైసీపీ ఎమ్మెల్యే హయాంలో నూజివీడు సరైన విధంగా అభివృద్ధి చెందకపోవడం కూడా ఓటర్ మైండ్ సెట్ మారడానికి కారణంగా సర్వేలో తేలింది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై పెరిగిన వ్యతిరేకత కూడా టీడీపీ ఓట్ షేర్ పెరగడానికి కారణమవుతోందని తేలింది.

Read More : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. చీరాలలో సీటును నిలబెట్టుకునేది ఎవరు ?

మేక వెంకట ప్రతాప్ అప్పారావు వైసీపీ VS పార్ధసారథి టీడీపీ

ఇప్పటికిప్పుడు నూజివీడులో ఎన్నికలు జరిగి వైసీపీ అభ్యర్థిగా మేక అప్పారావు, టీడీపీ నుంచి పార్ధసారథి బరిలో దిగితే వైసీపీకే గెలిచే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. మేక అప్పారావుకు 49 శాతం ఓట్లు, అలాగే టీడీపీ అభ్యర్థి పార్థసారథికి 45 శాతం ఓట్లు, ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి వైసీపీకి రిజైన్ చేసి టీడీపీలో చేరారు. అయితే ఆయన్ను పెనమలూరు కాకుండా, నూజివీడు నుంచి బరిలో దింపాలని చంద్రబాబు యోచిస్తున్నారు. కానీ పార్టీ మారడం, క్యాడర్ సపోర్ట్ ఉంటుందా ఉండదా అన్న డౌట్లు.. ఇప్పటికే నూజివీడు టీడీపీ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు రియాక్షన్ ఎలా ఉంటుందన్నది గెలుపోటములను డిసైడ్ చేయబోతోంది.

మేక వెంకట ప్రతాప్ అప్పారావు వైసీపీ VS పర్వతనేని గంగాధర్ (టీడీపీ)

ఇప్పటికిప్పుడు నూజివీడులో ఎన్నికలు జరిగి మేక అప్పారావు, పర్వతనేని గంగాధర్ మధ్య పోటీ జరిగితే వైసీపీకే గెలుపు ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీకి 48 శాతం ఓట్లు, టీడీపీ నుంచి బరిలో దిగే పర్వతనేని గంగాధర్ కు 40 శాతం ఓట్లు, ఇతరులకు 12 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని జనం అభిప్రాయంగా సర్వేలో తేలింది.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×