BigTV English

Nagoba Jatara: నేడే నాగోబా జాతర.. మహాపూజతో ప్రారంభం!

Nagoba Jatara: నేడే నాగోబా జాతర.. మహాపూజతో ప్రారంభం!
nagoba jatara

Nagoba Jatara 2024: తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఆదివాసీల ఉత్సవమైన నాగోబా జాతర నేటి నుంచి అత్యంత వైభవంగా సాగనుంది. మేడారం తర్వాత అంతటి పేరుగాంచిన జాతర ఇది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ రోజు అర్థరాత్రి మహాపూజతో జాతర ప్రారంభంకానుండగా.. మూడు రోజులపాటు ప్రత్యేక పూజల అనంతరం జాతర ముగియనుంది.


Read More : రాహువు స్థానం.. ఆ రాశులనే ప్రభావితం చేస్తుందా?

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో జరిగే నాగోబా జాతరకు మెస్రం వంశీయులు 80 కిలో మీటర్ల దూరంలో ఉన్న జన్నారం మండలం కలమడుగుకు సమీపంలో ఉన్న గోదావరి నది నుంచి ప్రత్యేకమైన కుండలలో జలాన్ని తీసుకువచ్చి స్వామివారిని అభిషేకించడంతో జాతర ప్రారంభమవుతుంది. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఉత్సవంలో భాగంగా రాత్రంతా నాగదైవానికి మహాపూజ నిర్వహించిన అనంతరం వరుసగా మూడు రోజులపాటు కన్నుల పండుగగా, కోలాహలంగా జాతరను నిర్వహిస్తారు. ఈ మూడు రోజులపాటు ప్రతిరోజు ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. మెస్రం వంశీయులు మట్టితో పుట్టను తయారు చేయడంలో మెస్రం చేస్తారు.


మహాపూజ తర్వాత రాత్రి ఒంటిగంటకు భేటింగ్ నిర్వహిస్తారు. ఇందులో కొత్త కోడళ్లను పరిచయం చేస్తూ ఈ భేటింగ్‌ సాగుతుంది. భేటింగ్ సమయంలో కోడళ్లు తెల్లటి వస్ర్తం ధరించి సతీ దేవత ఆలయంలో పూజలు చేస్తారు. ఆతర్వాత పెద్దల ఆశీర్వాదంతో పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్లుగా భావిస్తారు. మరుసటి రోజు పెర్సపేస్, బాన్పేస్, మండగాజిలిపూజ, బేతల్ పూజలు జరుగుతాయి. ఆ తర్వాత 12వ తేదీనాడు దర్బార్‌తో నాగోబా జాతర ముగియనుంది.

Read More : ఈ వస్తువులను ఇంట్లో ఆ దిశలో ఉంచకూడదా..? రాహు-కేతుల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?

ఆదివాసి ఉత్సవమైన నాగోబా జాతరకు తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. పెద్ద ఎత్తున జరిగే ఈ ఉత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి కాంగ్రెస్‌ సర్కార్‌ హయాంలో జరుగుతున్న ఉత్సవం కావడంతో ప్రతిష్మాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌస్‌లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాతర నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×