Big Stories

Ponnuru Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. పొన్నూరు పోల్ వార్ లో విజేత ఎవరు ?

Ponnuru Assembly Constituency(AP elections news): పొన్నూరు రాజకీయాలు ఏపీలో ఎప్పుడూ హాట్ హాట్ గానే సాగుతుంటాయి. ఇక్కడ పొలిటికల్ గా ధూళిపాళ్ల కుటుంబానికి చాలా గట్టి పట్టు ఉంది. ధూళిపాళ్ల వీరయ్య గతంలో టీడీపీ నుంచి రెండుసార్లు గెలిస్తే.. ఆ తర్వాత ఆయన రాజకీయ వారసత్వంగా ధూళిపాళ్ల నరేంద్ర ఏకంగా ఐదుసార్లు పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు. గత ఎన్నికల్లో ఓడిపోయి మళ్లీ ఇప్పుడు మరో ఎన్నికల పరీక్షకు సిద్ధమయ్యారు. మరి పొన్నూరు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.

- Advertisement -

కిలారి వెంకట రోశయ్య VS దూళిపాళ్ల నరేంద్ర

- Advertisement -

2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కిలారి వెంకట రోశయ్య 46 శాతం ఓట్లు దక్కించుకుని గెలిచారు. టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్లకు 45 శాతం ఓట్లు వచ్చాయి. కేవలం 1 శాతం ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిని విజయం వరించింది. అదేసమయంలో జనసేన అభ్యర్థికి 6 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులు 3 శాతం ఓట్లు సాధించారు. జగన్ వేవ్ పని చేయడం, టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేయడం వైసీపీకి పొన్నూరులో చాలా వరకు కలిసి వచ్చింది. మరి ఈసారి ఎన్నికల్లో పొన్నూరు సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

కిలారి వెంకట రోశయ్య (YCP) ప్లస్ పాయింట్స్

ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండడం

కిలారి పని తీరుపట్ల క్యాడర్ లో సంతృప్తి

జనంలో యాక్టివ్ గా ప్రచారాలు

వాలంటీర్ వ్యవస్థపై పొన్నూరులో పాజిటివ్ టాక్

విద్యాసంస్థల్లో మెరుగుపడ్డ వసతులు

కిలారి వెంకట రోశయ్య మైనస్ పాయింట్స్

కేవలం కొందరికే అందిన టిడ్కో ఇండ్లు

పొన్నూరు-బాపట్ల రూట్ లో ట్రాఫిక్ ఇబ్బందులు

చేబ్రోలు మండలంలో బ్రిడ్జి లేక ప్రయాణికుల అవస్థలు

పెదకాకాణి మండలంలో తాగు, సాగునీటి సమస్యలు

పొన్నూరు టౌన్ లో సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేక ఇబ్బందులు

ధూళిపాళ్ల నరేంద్ర (TDP) ప్లస్ పాయింట్స్

సీనియర్ మోస్ట్ లీడర్ గా జనంలో గుర్తింపు

తన హయాంలో చేసిన అభివృద్ధి పనులు

ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం

స్ట్రాంగ్ క్యాడర్ సపోర్ట్

ధూళిపాళ్ల నరేంద్ర మైనస్ పాయింట్స్

జనసేన నుంచి ఓట్ల బదిలీ కీ ఫ్యాక్టర్

వడ్రాణం మార్కండేయ బాబు (JSP) ప్లస్ పాయింట్స్

పొన్నూరులో యాక్టివ్ గా ప్రచారాలు

గతంలో పీఆర్పీలో చేసిన అనుభవం

జనసేనలో ప్రధాన కార్యదర్శి పదవి

పబ్లిక్ లో పాజిటివ్ ఇమేజ్

వడ్రాణం మార్కండేయ బాబు మైనస్ పాయింట్స్

టీడీపీతో పొత్తులో భాగంగా టిక్కెట్ దక్కడంపై అనుమానం

ఇక వచ్చే ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

కిలారు వెంకట రోశయ్య VS దూళిపాళ్ల నరేంద్ర

ఇప్పటికిప్పుడు పొన్నూరు అసెంబ్లీలో ఎన్నిక జరిగితే గెలుపు అవకాశాలు టీడీపీకే ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకు 48 శాతం ఓట్లు, వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యకు 45 శాతం ఓట్లు, ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. టీడీపీ అభ్యర్థి గెలిచేందుకు స్కోప్ ఎక్కువ ఉండడానికి కారణం క్యాడర్ నుంచి సపోర్ట్ బాగుండడం, జనంలో సింపథీ పెరగడం వంటివి కీలకంగా మారుతున్నాయి. అదే సమయంలో ఈ పొన్నూరు సెగ్మెంట్ టీడీపీకి స్ట్రాంగ్ గా ఉండడం, జనసేనతో పొత్తు కలిసి వస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేయడంతో ఒక్క శాతం ఓట్లతో ధూళిపాళ్ల ఓడిపోయారు. కానీ ఇప్పుడు కలిసి పోటీ చేస్తుండడంతో ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. ఇక వైసీపీ ఓట్ షేర్ కు కారణం ప్రభుత్వ స్కీంలతో లబ్దిపొందుతున్న ఓటర్లలో కొందరు అటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News