Big Stories

Raptadu Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. రాప్తాడులో పరిటాల కుటుంబం పుంజుకుందా..?

Political news in AP

Big Tv Survey in Raptadu Assembly Constituency (Political news in AP):

రాయలసీమ రాజకీయాల్లో రాప్తాడు పాలిటిక్స్ కు చాలా ప్రాధాన్యం ఉంది. ఒకప్పుడు ఫ్యాక్షన్ కక్ష్లలతో ఈ ప్రాంతం రగిలిపోయింది. ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తుంటాయి. రాప్తాడు, పెనుగొండ ప్రాంతాల్లో పరిటాల రవి బలమైన నేతగా పేరుతెచ్చుకున్నారు. ఆయన హత్య తర్వాత ఇక్కడి రాజకీయాల్లో పరిటాల సునీత, పరిటాల శ్రీరాం కీలకంగా ఉంటూ వస్తున్నారు. పరిటాల సునీత 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. అయితే ఈసారి ఎన్నికల్లోనూ పరిటాల వర్సెస్ తోపుదుర్తి పోటీ ఖాయమైంది. వైసీపీ వర్సెస్ టీడీపీ ద్విముఖపోరు ఆసక్తికరంగా ఉండబోందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. టగ్ ఆఫ్ వార్ ఖాయమని వెల్లడైంది. మరి రాప్తాడు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.

- Advertisement -

2019 RESULTS

- Advertisement -

తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి VS పరిటాల శ్రీరామ్

2019 ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గెలిచారు. గత ఎన్నికల్లో పరిటాల సునీత పోటీ చేయకుండా.. తన కొడుకు పరిటాల శ్రీరాంను బరిలో దింపారు. అయితే రాజకీయాలకు శ్రీరాం కొత్త కావడంతో సీనియర్ అయిన ప్రకాశ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 55 శాతం ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి 42 శాతం ఓట్లు సాధించారు. ఇతరులకు 3 శాతం ఓట్లు వచ్చాయి. మరి ఈసారి ఎన్నికల్లో రాప్తాడు సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి (YCP) ప్లస్ పాయింట్స్

సుదీర్ఘ రాజకీయ అనుభవం

సెగ్మెంట్ లో యాక్టివ్ గా రాజకీయాలు

క్యాడర్, పార్టీ నాయకత్వంతో మంచి సమన్వయం

ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్ధ

జనంలో ఇమేజ్ పెంచుకున్న ప్రకాశ్ రెడ్డి

అమ్మ డెయిరీతో మహిళలకు ఉపాధి అవకాశాలు

లాభాలు షేర్ చేసేలా డెయిరీ నిర్వహణ

తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మైనస్ పాయింట్స్

భూకబ్జా ఆరోపణలు

అవినీతి ఆరోపణలు

రాప్తాడులో జనానికి తాగునీటి సమస్యలు

నీటి సరఫరా కోసం సరైన పైప్ లైన్లు లేవంటున్న జనం

పరిటాల సునీత (TDP) ప్లస్ పాయింట్స్

పరిటాల ఫ్యామిలీకి రాప్తాడులో ఆదరణ

గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి

ఏడాదిన్నర నుంచి పరిటాల సునీత సెగ్మెంట్ లో యాక్టివ్

బాబు షూరిటీ, భవిష్యత్ కు గ్యారెంటీ ప్రోగ్రామ్ నిర్వహణ

గడప గడపకు క్యాంపెయినింగ్

శ్రీరాంకు బదులు సునీత బరిలో దిగడం

ఇక వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి VS పరిటాల సునీత

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. ఎవరు గెలిచినా అతి తక్కువ మెజార్టీతోనే గెలుస్తారని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. అయితే ఇప్పటికిప్పుడు ఉన్న సమీకరణాలు జనం అభిప్రాయం ప్రకారం వైసీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. వైసీపీ నుంచి బరిలో ఉండే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి 48 శాతం ఓట్లు, అలాగే పరిటాల సునీతకు 47 శాతం ఓట్లు, ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వైసీపీకి ఎడ్జ్ ఎక్కువగా ఉండడానికి కారణం.. రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి పాజిటివ్ ఇమేజ్ ఉండడం కలిసి వస్తోంది. ఈయన హయంలో రాప్తాడు నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు జరగడం, ఇండ్ల పట్టాల పంపిణీ, పేరూరు డ్యాం సమస్యలు తీరడంతో వైసీపీ ప్రభుత్వంపై రైతుల్లో సానుకూలత ఉంది. మరోవైపు రాప్తాడులో గెలుపు కోసం టీడీపీ పరిటాల ఫ్యామిలీ ఇమేజ్ పైనే ఆధారపడాల్సి వస్తోంది. పరిటాల కుటుంబం 1994 నుంచి గెలుస్తూ వస్తోంది. గతంలో వీరు పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండేవారు. నియోజకవర్గాల పునర్విభజనతో రాప్తాడు నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి సింపతీ కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై ఉన్న నెగెటివిటీ, ప్రభుత్వ వ్యతిరేకత, చంద్రబాబు అరెస్ట్ పర్యవసనాలు టీడీపీ ఓట్ షేర్ కు కలిసి వచ్చే ఛాన్స్ ఉందని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది.

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News