Posani Krishna Murali: వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని రేపో మాపో అరెస్ట్ కావడం ఖాయమా? వరుసగా కేసుల నమోదుపై ఆయనేమన్నారు? రేపో మాపో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు సీఐడీ రంగంలోకి దిగుతుందా? దానిపై ఆయనేమన్నారు? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
కేసు నమోదు విషయంలో అర్థసెంచరీ కొట్టేశారు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి. సీఐడీ కూడా కేసు నమోదు చేసింది. అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ని విచారించాలని ఆలోచన చేస్తోంది. ఇందుకు సంబంధించి డీటేల్స్‌ను తీసుకునే పనిలో పడింది. రేపో మాపో ఆయనకు సీఐడీ నోటీసులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ‘బిగ్ టీవీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు పోసాని కృష్ణమురళి. తనను, ఫ్యామిలీని దారుణంగా తిట్టారని, అందువల్లే వారిని వాళ్లని తిట్టానన్నది ఆయన మాట. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తారా? తనను తాను ప్రజా ఓటరుగా అభివర్ణించుకున్నారాయన.
ఇలా ప్రశ్నించినందుకు ఒకప్పుడు తనను మంచివాడని అన్నారని, ఇప్పుడు ప్రజల కోసం ప్రశ్నించడమే తప్పా అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు పోసాని. తనపై పోలీసులు విచారణ చేస్తే వారికి ఎలాంటి ఆధారాలు దొరకవన్నారు. మంచి నాయకుడిని తాను ఎన్నడు తిట్టలేదన్నారు. ఇంతకీ ఆయన మనసులో మంచి నాయకుడు ఎవరనేది ప్రశ్నార్థకం.
ALSO READ: ఇదీ వైసీపీ ప్రభుత్వ నిర్వాకం, కడిగి పారేసిన మంత్రి కేశవ్.. అసలేం జరిగింది?
అధికారం ఇచ్చిన ప్రజలకు అన్యాయం చేసిన వారిని ప్రశ్నించడం నేరమా ? గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలను కొందరు టార్గెట్ చేస్తే తాను ఖండించిన విషయాన్ని గుర్తు చేశారు. అన్యాయంగా మాట్లాడితే తాను స్టేషన్‌కు వెళ్తానని చెప్పుకొచ్చారు. కేసుల కోసం భయపడి పారిపోయే తత్వం తనది కాదన్నారు.
తనకు రాజకీయాలంటే ఇష్టమని, కేవలం సర్వీసు మాత్రమేనని అన్నారు పోసాని. రాజకీయాల పేరుతో అన్యాయాన్ని ప్రశ్నించకూడదా? అంటూ ఎదురు ప్రశ్నవేశారు. అర్థరాత్రి వేళ అరెస్ట్ చేయడం ఏంటన్నది ఆయన మాట. వైసీపీ హయాంలో టీడీపీ మాజీ మంత్రులను అర్థరాత్రి అరెస్టు చేసినప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు?
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్పుకాదని, ప్రశ్నించే సమయంలో బూతులు తిట్టడం తప్పుకాదా అన్న ప్రశ్నకు తనదైన శైలిలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగు నెలలు అవుతోందని, ప్రజలు ఏడుస్తున్న కష్టాలు ఈ మధ్యకాలంలో జరిగినవా? గడిచిన ఐదేళ్లలో కనిపించ లేదా? అన్న ప్రశ్నకు తప్పించుకునే ప్రయత్నం చేశారాయన.
నన్ను నా కుటుంబాన్ని తిట్టారు కాబట్టే వాళ్లని తిట్టాను : పోసాని
ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తారా ?
పోలీసులు నాపై విచారణ చేస్తే నేను తప్పు చేసినట్లు వాళ్ళకు ఎలాంటి ఆధారాలు దొరకవు.
అన్యాయంగా ఒక మంచి నాయకుడిని నేను ఎన్నడూ తిట్టలేదు.… pic.twitter.com/c2EsBry2BF
— BIG TV Breaking News (@bigtvtelugu) November 20, 2024