Indian Raiways: రైలు ప్రయాణీకులు సాధారణంగా రద్దీ సమయాల్లో టికెట్లు బుక్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతారు. ఒకవేళ టికెట్లు బుక్ చేసినా కన్ఫర్మ్ అవుతాయో? లేదో? అని టెన్షన్ పడుతారు. కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఈజీగా టికెట్స్ బుక్ చేసుకుని, హ్యాపీగా ట్రైన్ జర్నీ చేసే అవకాశం ఉంటుంది. ట్రైన్ ట్రావెలర్స్ కు ఎంతో ఉపయోగపడే 5 బెస్ట్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
టిప్ నెంబర్ 1:
రైల్వే ప్రయాణీకులు చాలా వరకు IRCTC Rail Connect యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటారు. ఈ యాప్ ద్వారా సేఫ్ గా, ఈజీగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ను ఇన్ స్టార్ చేసుకున్న తర్వాత.. లాగిన్ కావాలి. బాటమ్ లో ఉన్న ‘మోర్ ఆప్షన్స్’ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ ను ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రతిసారి లాగిన్ సమయంలో క్యాప్చా, ఓటీపీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. టైమ్ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
టిప్ నెంబర్ 2:
IRCTC Rail Connect యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసిన ప్రతిసారి ప్యాసెంజర్ వివరాలు ఫిల్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ పాటించాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత బాటమ్ లోని ‘అకౌంట్స్’ను ఓపెన్ చేయాలి. అందులో ‘మై మాస్టర్ లిస్ట్’ను క్లిక్ చేయాలి. దానిలో మీరు టికెట్ బుక్ చేయాలనుకునే వారి డీటైల్స్ ముందుగానే ఫిల్ చేసుకోవాలి. తత్కాల్ టైమ్ లో డీటైల్ ఎంటర్ చేసే టైమ్ సేవ్ అవుతుంది. ఈజీగా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కన్ఫామ్ టికెట్లు పొందవచ్చు.
టిప్ నెంబర్ 3:
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే మనం ఫాస్ట్ గా ఉంటే సరిపోదు. మనం వాడే నెట్ కూడా చాలా ఫాస్ట్ గా ఉండాలి. సో, గూగుల్ లో ‘పింగ్ టెస్ట్’ అని టైప్ చేయాలి. సైట్ ఓపెన్ చేయాలి. యావరేజ్ వ్యాల్యూ 100 మిల్లీ సెకెన్లకు పైగా ఉంటే స్లోగా ఉందని అర్థం. ఇంటర్నెట్ కలెక్షన్, సిగ్నల్ సరిగా ఉన్న ప్లేస్ నుంచి టికెట్స్ బుక్ చేసుకోవాలి. అప్పుడే ఈజీగా టికెట్స్ బుక్ అవుతాయి.
టిప్ నెంబర్ 4:
రైలు టికెట్లు బుక్ చేసే సమయంలో ‘అదర్ ప్రిపరెన్సెస్’ సెక్షన్ లో ‘కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రడేషన్’ను టిక్ చేయాలి. ఒకవేళ ఏసీ కోచ్ లో ఏవైనా బెర్త్ వెయికెన్సీలు ఉంటే చార్ట్ ప్రిపరేషన్ సమయంలో ఆటో మేటిక్ గా ఏసీ కోచ్ లో మీకు బెర్త్ అలాట్ అవుతుంది.
టిప్ నెంబర్ 5:
మీరు రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో ఎలాంటి సమస్య వచ్చినా, 139కి కాల్ చేసి ‘రైల్ మద్దత్ సపోర్టు’ తీసుకోవచ్చు. మెడికల్, సెక్యూరిటీ ఎమర్జెన్సీతో పాటు కోచ్ క్లీన్ గా లేకున్నా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే సంబంధిత సిబ్బంది వచ్చి మీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు.
Read Also: భారతీయ రైల్వేలో M1 కోచ్ వెరీ స్పెషల్, ఇంతకీ దీని ప్రత్యేక ఏంటో తెలుసా?