Winter Skin Care: చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిగా మారుతుంది. అంతే కాకుండా చర్మంపై మంటగా కూడా అనిపిస్తుంటుంది. ఈ సీజన్‌లో ముఖ చర్మంపై నుంచి మృతకణాలు తొలగించడానికి తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేయడం అవసరం. దీంతో చర్మం మృదువుగా, శుభ్రంగా, కాంతివంతంగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఇది రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. తేమను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న సహజ ఎక్స్‌ఫోలియేటర్లను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మంపై మృత కణాలను తొలగించడానికి సహజమైన ఎక్స్‌ఫోలియేటర్లను ఉపయోగించండి. చలికాలంలో పొడి చర్మం మరింత పొడిగా మారుతుంది. ఈ సీజన్‌లో స్కిన్ పొడిబారడంతో పాటు డెడ్ స్కిన్ రాలుతుంటుంది. అందుకే చర్మం మెరిసేలా చేయడానికి, సహజమైన ఎక్స్‌ఫోలియేటర్లను ఉపయోగించడం చాలా ముఖ్యం.
చలి కాలంలో కాలక్రమేణా మన చర్మంపై మృత చర్మ కణాలు పేరుకుపోవడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా చర్మం పొడిగా, నిస్తేజంగా మారడంతో పాటు నిర్జీవంగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఎప్పటికప్పుడు ఎక్స్‌ఫోలియేట్ చేయడం ద్వారా, చర్మం నుంచి మృతకణాలు తొలగించబడతాయి. ఇది చర్మంలో రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే, చర్మం మృదువుగా, శుభ్రంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.
ఎక్స్‌ఫోలియేషన్ పొడి చర్మంపై డెడ్ స్కిన్ తగ్గించడం ద్వారా తేమను లోతుగా గ్రహించడంలో సహాయపడుతుంది. పొడి చర్మం ఉన్న వారు కొన్ని ప్రత్యేకమైన సహజ ఎక్స్‌ఫోలియేటర్లను వాడటం చాలా ముఖ్యం.
ఓట్స్:
ఓట్స్ పొడి చర్మం ఉన్న వారికి ఖచ్చితంగా సరిపోతుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం కాస్త పాలు, తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది.
పెరుగు:
పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ తొలగించి డ్రైనెస్ తగ్గించడంలో సహాయపడుతుంది. పెరుగులో కాస్త తేనె మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా చేయడం ద్వారా స్కిన్ అందంగా మారుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
చక్కెర , ఆలివ్ ఆయిల్ :
చక్కెర, ఆలివ్ ఆయిల్ కలిపి చర్మాన్ని సున్నితంగా స్క్రబ్ చేయండి. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడమే కాకుండా తేమగా ఉంచుతుంది.
Also Read: హెన్నాలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జన్మలో తెల్లజుట్టు రాదు
శనగపిండి, పాలు:
శనగపిండిలో పాలు, పసుపు కలిపి రాసుకోవాలి. ఇది పొడి చర్మానికి పోషణనిస్తుంది. అంతే కాకుండా డెడ్ స్కిన్‌ని కూడా తొలగిస్తుంది.
కాఫీ పౌడర్ :
కాఫీ పౌడర్ తో చర్మాన్ని సున్నితంగా స్క్రబ్ చేయడం ద్వారా రక్త ప్రసరణను పెంచుతుంది . దీన్ని కొబ్బరి నూనెతో కలిపి ముఖానికి వాడండి. ఇలా తరుచుగా వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.