Payyavula Keshav: వైసీపీ నిర్వాకాన్ని సభలో ఎండగట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. చట్ట సభలు అనుమతి లేకుండా నిధులు ఖర్చు చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. రేపటి రోజున గెలిచిన ఎమ్మెల్యేలు ఏ బడ్జెట్‌ని ఆమోదించాలి? ఎందుకు వైసీపీ సభ్యులు ఉలిక్కిపడుతున్నారని మంత్రి ఎదురుదాడితో వారంతా సైలెంట్ అయిపోయారు. అసలేం జరిగింది?
ప్రశ్నోత్తరాల సమయంలో నిధుల గురించి వివిధ సభ్యులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ సుదీర్థంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. మంత్రి సమాధానాలపై వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అధికార-విపక్ష సభ్యులను అదుపు చేయడానికి కాసింత ఇబ్బందిపడ్డారు ఛైర్మన్. చివరకు మంత్రి కేశవ్ వివరణ ఇచ్చుకున్నారు.
చట్ట సభలు అనుమతి లేకుండా నిధులు ఖర్చు చేస్తే అప్పుడూ ప్రశ్నించానని అన్నారు సదరు మంత్రి. ఇదే విషయాన్ని సభలో లేవనెత్తాననని తెలిపారు. 25 ఏళ్ల భవిష్యత్తు ఆదాయాన్ని ఎస్క్రో చేశారు. సభకు తెలీకుండా నిధులు నేరుగా వెళ్లిపోయినట్టు చేశారని, రేపటి రోజున గెలిచిన ఎమ్మెల్యేలు ఏ బడ్జెట్‌ని ఆమోదించాలని అన్నారు. ఈ విషయంలో వైసీపీ సభ్యులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని అన్నారు మంత్రి.
గత వైసీపీ ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కిందన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఇరు సభలు అనుమతి ఇస్తేనే ప్రతీ రూపాయి ఖర్చు పెట్టాలన్నారు. సభ అనుమతి లేకుండా నేరుగా 600 కోట్లు రూపాయలు ఖర్చు చేసిందన్నారు. చట్ట సభల పరిధిలోకి రాకుండా నిధులు సేకరించిందన్నారు.
ALSO READ: వివేకా కేసు మరో మలుపు, అవినాష్‌రెడ్డికి నోటీసులు.. ఆపై ప్రభుత్వంతో మంతనాలు
మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని, వాటిలో బేవరేజెస్, స్టేట్ డెవలప్‌మెంట్, ఏపీ ఫైనాన్సియల్ కార్పొరేషన్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని రెండు కార్పొరేషన్లకు మళ్లించారని వివరించారు. ఇదంతా చాలా రహస్యంగా జరిగిందన్నారు.
ఇది ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని, ఈ విషయాన్ని గవర్నర్‌తోపాటు కేంద్రమంత్రికి తెలిపామన్నారు. చివరకు ఆస్తులను సైతం తాకట్టు పెట్టారని గుర్తు చేశారు. గవర్నర్ పేరు మీదుగా అగ్రమెంట్లు జరుగుతాయని, ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామని తెలియజేశారు.
గవర్నర్.. అధికారులను పిలిచి మాట్లాడారని వివరించారు. చివరకు ప్రభుత్వం బ్యాంకులను పిలిచి మాట్లాడి మళ్లీ అగ్రిమెంట్లు చేసుకుందన్నునారు. ఇంకా చెప్పాలంటే కోర్టుల పరిధిలో ఉన్న సివిల్ డిస్ప్యూట్ల డిపాజిట్లను అప్పటి ప్రభుత్వం వినియోగించుకుందన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 25 ఏళ్ల భవిష్యత్తు ఆదాయాన్ని వాడేసిందని వివరించారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.