Amaravati: ఏపీ డీఎస్సీ-2025 వ్యవహారంపై అక్రమాల డొంక కదులుతోంది. నిన్న స్పోర్ట్స్ విభాగం, నేడు దివ్యాంగుల కోటా వంతైంది. ఈ అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఇలా ఒకొక్క విభాగంలో అక్రమాలు బయటకు రావడంతో ఏపీ ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైంది. రేపు ఇంకా ఏ విభాగంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయోనని వీక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
డీఎస్సీ-2025 ఉద్యోగాల నియామకంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత స్పోర్ట్స్ కోటాకు పరిమితమైన అక్రమాలు, మిగతా విభాగాలకు క్రమంగా పాకుతోంది. తాజాగా దివ్యాంగుల కోటాలోనూ అలాంటి అక్రమాలు జరిగినట్టు బిగ్ టీవీ ఛానెల్ బయటపెట్టింది. వంతైంది.
డీఎస్సీ గురించి వివరాలు ఒకొక్కటిగా బిగ్ టీవీ వెలుగులోకి తీసుకురావడంతో పరీక్ష రాసిన అభ్యర్థులు వేల సంఖ్యలో ఫోన్లు చేసి తమ గోడు వెళ్ల బోసుకుంటున్నారు. చాలా ఏళ్లుగా కష్టపడి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తే కోటా, కులం పరంగా తమకు అన్యాయం జరిగిందని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఈ విషయంలో తాము కలెక్టర్లకు సైతం ఫిర్యాదు చేశామని, ఏ ఒక్కరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.