E-Paper
Advertisement

జై షా ఉన్న‌న్ని రోజులు…టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవాల్సిందే

జై షా ఉన్న‌న్ని రోజులు…టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవాల్సిందే
Advertisement

Shahid Afridi On IND VS PAK:  మ‌హిళ‌ల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (Women’s Asia Cup 2026 Tournament) భాగంగా శనివారం టీమిండియా ఉమెన్స్ వర్సెస్ పాకిస్తాన్ మహిళల (India Women vs Pakistan Women, Match 9) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Dubai International Cricket Stadium, Dubai) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో టీమిండియా బంపర్ విక్టరీ నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయిన నేపథ్యంలో మాజీ క్రికెటర్లు రక రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. లేటెస్ట్ గా షాహిద్ అఫ్రిది (Shahid Afridi ) సంచలన వ్యాఖ్యలు చేశారు. జై షా ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు టీమిండియా పై పాకిస్తాన్ గెలవడం అసాధ్యమన్నారు. ఆసియా కప్ గ్రూప్ స్టేజ్ లో కూడా పాకిస్తాన్ జట్టును ఓడించేందుకు దుబాయ్ పిచ్ లో చిప్స్ పెట్టారని ఆరోపణలు చేశాడు. దీనంత‌టికి జై షా కార‌ణం అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

జై షా ఉన్న‌న్ని రోజులు…టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవాల్సిందే

ఆసియా కప్ 2026 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంటులో 9 మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. టీమిండియా సెమీ ఫైనల్ బెర్త్ కూడా ఖరారు చేసుకుంది. శనివారం రోజున టీమిండియా పై పాకిస్తాన్ గెలిచి ఉంటే.. ఆ టీమ్ కూడా సెమీ ఫైనల్కు దూసుకు వెళ్లేది. కానీ టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇలాంటి క్రమంలో షాహిద్ అఫ్రిది ( Shahid afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ పిచ్ లో చిప్స్ పెట్టారని.. అందుకే పాకిస్తాన్ 55 పరుగులకు కుప్పకూలినట్లు ఆరోపణలు చేశారు.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

దీనంతటికీ కారణం ఐసీసీ బాస్ జై షా ( ICC Jay shah) అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దగ్గరుండి దుబాయ్ పిచ్ రూపురేఖలను మార్చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే ఈ మైదానంలో పాకిస్తాన్ మహిళల జట్టు పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడినట్లు వ్యాఖ్యానించారు. ఐసీసీ బాస్ పదవిలో దేశ ఉండని రోజులు పాకిస్తాన్ గెలవడం అసాధ్యమని కుండ బద్దలు కొట్టి చెప్పారు. వెంటనే దీనిపై ఐసీసీ పెద్దలు యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐసీసీ అధ్యక్ష పదవిలో తనలాంటి వాళ్లను కూర్చోబెట్టాలని మెలిక పెట్టారు షాహిద్ అఫ్రిది. అప్ప‌టి వ‌ర‌కు పాకిస్తాన్ జ‌ట్టుకు ( Pakistan Team ) న్యాయం జ‌రగ‌బోదంటూ హాట్ కామెంట్స్ చేశారు. వెంట‌నే ఐసీసీ ( ICC) ఛైర్మ‌న్ ప‌ద‌విలో మార్పులు చేయాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

Related News

2021లో టీమిండియా ఓట‌మితోనే, పాకిస్తాన్ టీమ్ ప‌త‌నం మొద‌లైంది

ఇండియా, పాకిస్తాన్ మ‌ధ్య ట్రై సిరీస్‌…ఐసీసీ ప్లాన్ అదుర్స్‌

ఇప్పుడే సంబ‌రాలు చేసుకోకండి..ఫైన‌ల్స్ లో ప్ర‌తీకారం తీర్చుకుంటాం

పాకిస్తాన్ జ‌ట్టులోనూ కోటీశ్వరులు…షోయ‌బ్ అక్త‌ర్ నుంచి బాబ‌ర్ వ‌ర‌కు ఎవ‌రి ఆస్తులు ఎంతంటే ?

రియాజ్.. నీకు బుర్ర ఉందా ? 55 ప‌రుగుల చేసిన పాకిస్తాన్, ఎలా ఆసియా క‌ప్ కొడుతుంది ?

పాకిస్తాన్ ఘోర ఓట‌మి…హుటా హుటిన‌ దుబాయ్ వెళ్లిన న‌ఖ్వీ..!

టీమిండియా చేతిలో ఓడినా, ఆసియా కప్ గెలుస్తాం – పాక్ కోచ్ సంచలనం

Big Stories

Advertisement
×