ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర రాజకీయాలు కాస్త భిన్నం. మిగతా ప్రాంతాల్లో కనిపించే వాడీ వేడీ రాజకీయాలు ఎప్పుడో గానీ కనిపించవు. ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాల్లో ఒకటి విజయనగరం జిల్లాలోని రాజాం అసెంబ్లీ నియోజకవర్గం. రాజాం ఎస్సీ రిజర్వ్ డ్ సెగ్మెంట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా స్పీకర్ ప్రతిభా భారతి ఈ సెగ్మెంట్ నుంచే గెలిచారు. 2008కి ముందు ఉనుకూరు సెగ్మెంట్లో భాగంగా రాజాం ఉండేది. ఆ తర్వాత ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో బీసీలు 65 శాతం ఉన్నారు ఎస్సీ సామాజికవర్గం జనాభా 15 శాతమే ఉన్నా.. దీన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేకంబాల జోగులు పాయకరావు పేటకు షిఫ్ట్ చేసింది వైసీపీ హైకమాండ్. అదే సమయంలో తొలిసారి పోటీ చేయబోతున్న తాలే రాజేశ్ ను రాజాం వైసీపీ ఇంఛార్జ్ గా నియమించారు. మరి రాజాం నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.
2019 RESULTS
కంబాల జోగులు గెలుపు (YCP) VS కొండ్రు మురళీ మోహన్
2019 ఎన్నికల్లో రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా పరిణామాలు జరిగాయి. వైసీపీ నుంచి పోటీ చేసిన కంబాల జోగులు 51 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన కొండ్రు మురళీ 41 శాతం ఓట్లు రాబట్టారు. అయితే 2014లోనూ గెలిచిన కంబాల జోగులు.. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించలేదని, మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని 2019లో ప్రచారం చేసి గెలిచారు. ప్రతిభా భారతి తన కూతురు గ్రీష్మకు టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నించినా కొండ్రు మురళికే టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. అయితే గెలవలేకపోయారు. రాజాంలో జనసేన 3 శాతం ఓట్లు సాధిస్తే ఇతరులు 5 శాతం ఓట్లు రాబట్టారు. మరి ఈసారి ఎన్నికల్లో రాజాం సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
ముందుగా వైసీపీ నేత తాలే రాజేశ్ ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటో పరిశీలిస్తే..
తాలే రాజేశ్ (YCP) ప్లస్ పాయింట్స్
తండ్రి సుదీర్ఘ రాజకీయ వారసత్వం
సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు సపోర్ట్
డాక్టర్ గా ప్రజల్లో గుర్తింపు
వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహారాలు
పార్టీ శ్రేణులతో సత్సంబంధాలు
తాలే రాజేశ్ మైనస్ పాయింట్స్
రాజాం సెగ్మెంట్లో గుంతల రోడ్ల సమస్య
రాజాం టు చీపురుపల్లి, రాజాం టు పాలకొండ మధ్య బాగా లేని రోడ్లు
రాజాం అంతటా సరిగా లేని డ్రైనేజ్ వ్యవస్థ
తండ్రి ఇమేజ్ ఎంత వరకు ఉపయోగపడుతుందన్న డౌట్లు
ఇవి తాలే రాజేశ్ ప్లస్, మైనస్ పాయింట్స్. ఇక ఇదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న కొండ్రు మురళీ మోహన్ ప్లస్, మైనస్ పాయింట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిస్తే..
కొండ్రు మురళీ మోహన్ (TDP) ప్లస్ పాయింట్స్
సుదీర్ఘ రాజకీయ అనుభవం
రాజాం సెగ్మెంట్లో గుర్తింపు ఉన్న నాయకుడు
కొండ్రు హయాంలో జరిగిన రాజాం అభివృద్ధి
క్యాడర్ సపోర్ట్
పార్టీకార్యక్రమాల్లో చురుగ్గా బాధ్యతలు
కొండ్రు మురళీ మోహన్ మైనస్ పాయింట్స్
వైసీపీ హవాను ఏమేరకు అడ్డుకుంటారన్న డౌట్లు
ఇవి కొండ్రు మురళీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్. ఇక టీడీపీ నుంచి కావలి గ్రీష్మ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆమె ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ పరిశీలిస్తే..
కావలి గ్రీష్మ (TDP) ప్లస్ పాయింట్స్..
మాజీ స్పీకర్ ప్రతిభా భారతి రాజకీయ వారసత్వం
యువ నాయకురాలిగా పార్టీలో గుర్తింపు
కావలి గ్రీష్మ మైనస్ పాయింట్స్
రాజకీయంగా అనుభవం లేకపోవడం
సెగ్మెంట్ లో బలమైన ఇమేజ్ సాధించడంలో వెనుకంజ
Caste Politics
రాజాం నియోజకవర్గంలో తూర్పుకాపు సామాజికవర్గం జనాభా బలంగా ఉంది. ఇందులో 65 శాతం మంది వైసీపీకి సపోర్ట్ ఇస్తామంటే.. 35 శాతం మంది టీడీపీకి సపోర్ట్ గా ఉంటామని బిగ్ టీవీ సర్వేలో వెల్లడించారు. ఉత్తరాంధ్రలో మరో కీలక సామాజికవర్గమైన పొలినాటి వెలమ కమ్యూనిటీ కూడా రాజాంలో బలంగానే కనిపిస్తోంది. ఈ సామాజికవర్గంలో 35 శాతం మంది జగన్ పార్టీకి, 65 శాతం మంది టీడీపీకి సపోర్ట్ గా ఉంటామని తమ అభిప్రాయంగా వెల్లడించారు. అటు ఎస్సీల్లో 55 శాతం మంది వైసీపీకి, 35 శాతం మంది టీడీపీకి, 10 శాతం మంది ఇతరులకు మద్దతు ఇస్తామంటున్నారు. పద్మశాలి కమ్యూనిటీలో 40 శాతం మంది జగన్ పార్టీకి, 50 శాతం టీడీపీకి, 10 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో రాజాం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం.
తాలే రాజేశ్ VS కొండ్రు మురళీ
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. రాజాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కే ఎక్కువ గెలుపు అవకాశాలు కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థి తాలే రాజేశ్ 46 శాతం ఓట్లు రాబట్టే అవకాశం ఉండగా, కొండ్రు మురళీ టీడీపీ టిక్కెట్ దక్కించుకుని పోటీ చేస్తే 43 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తేలింది. ఇతరులకు 11 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
తాలే రాజేశ్ VS కావలి గ్రీష్మ
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. రాజాం సెగ్మెంట్ లో వైసీపీకే ఎక్కువగా గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి కావలి గ్రీష్మ పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థి తాలే రాజేశ్ కు 48 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తేలింది. అదే సమయంలో ప్రతిభా భారతి కుమార్తె టీడీపీ టిక్కెట్ పై పోటీ చేస్తే 39 శాతం ఓట్లు వస్తాయని వెల్లడైంది. ఇతరులకు 13 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
.
.