BigTV English

Yemmiganur Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. ఎమ్మిగనూరు నియోజకవర్గం ఏ పార్టీకి అనుకూలంగా ఉంది ?

Yemmiganur Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. ఎమ్మిగనూరు నియోజకవర్గం ఏ పార్టీకి అనుకూలంగా ఉంది ?
AP News today telugu

Yemmiganur Assembly Constituency(AP news today telugu):

సీమ రాజకీయాల్లో ఎమ్మిగనూరుది ప్రత్యేక స్థానం. అటు కర్ణాటక, ఇటు తెలంగాణ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న నియోజకవర్గం. తుంగభద్ర ప్రవాహంతో పునీతమైన నేల అది. 1994 తర్వాత ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానిదే పెత్తనం. గత ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ స్థానంతో పాటు.. లోక్‌సభ పరిధిలోని అన్ని అసెంబ్లీలను వైసీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. మరోసారి సీన్ రిపీట్ చేయాలని ప్లాన్‌ చేస్తుంది. ఈసారి తగ్గేదేలే అంటోంది టీడీపీ, జనసేన కూటమి.


నిజానికి ఎమ్మిగనూరు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. 2004వరకు ఇక్కడ టీడీపీ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుంది. చేనేత, కర్ని సామాజిక వర్గం ఓటర్లే ఇక్కడ విజయాన్ని డిసైడ్ చేయగలరు. దీంతో కర్ని సామాజికవర్గానికి చెందిన వారికి టికెట్ ఇస్తే విక్టరీ ఈజీ అవుతుందన్న ఆలోచనలో ఉంది వైసీపీ. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున జయనాగేశ్వర రెడ్డి పోటీ చేశారు. ఐతే వర్గవిభేదాలు సైకిల్‌ పార్టీకి ఇక్కడం ఇబ్బందిగా మారాయ్‌. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున జయనాగేశ్వరరెడ్డి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ సారి ఎవరు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి? వారి బలాబలాలేంటి? ఎవరి బరిలోకి దిగితే ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి? అనే దానిపై బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్ ఎలక్షన్‌ సర్వే నిర్వహించింది. ఆ వివరాలను చూసే ముందు 2019 ఎన్నికల ఫలితాలను ఓ సారి పరిశీలిద్దాం.

2019 RESULTS


2019 ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీ వేవ్‌ ఉండటంతో వార్‌ వన్‌ సైడే అయ్యిందని చెప్పాలి. వైసీపీ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డి 53 శాతం ఓట్‌షేర్‌తో ఘన విజయం సాధించారు. అంతకు ముందు ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆయన కొడుకుకు కాకుండా తండ్రినే బరిలోకి దింపి బంపర్‌ విక్టరీ సాధించింది వైసీపీ. చంద్రశేఖర్ రెడ్డి పాజిటివ్ ఇమేజ్‌కు తోడు వైసీపీ వేవ్ కనిపించింది. అంతేగాకుండా అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న జయనాగేశ్వర్‌ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత కూడా చెన్నకేశవరెడ్డికి కలిసి వచ్చింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగిన జయనాగేశ్వర్‌ రెడ్డికి 39 శాతం ఓట్‌షేర్‌ మాత్రమే దక్కింది. దీంతో 13 శాతం ఓట్ల తేడాతో చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు. అయితే ఈ సారి ఎన్నికల్లో చాలా సమీకరణాలు మారాయి. అధికార వైసీపీలో టికెట్ పంచాయితీ మొదలైంది. అంతర్గత కుమ్ములాటలకు తోడు.. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న ఒపీనియన్‌ కూడా మారుతూ వస్తోందన్న ప్రచారం జరుగుతోంది. గ్రౌండ్‌ లెవల్‌లో ఏం జరుగుతుందన్న దానిపై సమగ్రంగా నిర్వహించిన బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ సర్వే వివరాలను ఇప్పుడు చూద్దాం.

మాచని వెంకటేశ్‌ (YCP) ప్లస్ పాయింట్స్

బీసీ అభ్యర్థిగా బరిలోకి దిగడం

ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి మద్ధతు

మాచని వెంకటేశ్‌ మైనస్ పాయింట్స్‌

ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోవడం

ప్రజల్లో ఎక్కువ గుర్తింపు లేకపోవడం

బుట్టా రేణుక వర్గం మద్ధతివ్వకపోవడం

ఇవి మాచని వెంకటేశ్ ప్లస్, మైనస్ పాయింట్స్. ఇప్పుడు అదే పార్టీ నుంచి టికెట్ వస్తుందని ఆశిస్తున్న మరో నేత బుట్టా రేణుక ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం.

బుట్టా రేణుక (YCP) ప్లస్‌ పాయింట్స్

గత ఎన్నికల్లో ఎంపీగా గెలుపు

బుట్టా రేణుక మైనస్ పాయింట్స్

నియోజకవర్గ నేతల్లో ఉన్న అంతర్గత విబేధాలు

చెన్నకేశవ రెడ్డి మద్ధతు ఇవ్వకపోవడం

సొంత వర్గం లేకపోవడం

నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటించకపోవడం

ఇవి వైసీపీ అభ్యర్థుల ప్లస్, మైనస్ పాయింట్స్. ఇక టీడీపీ నుంచి టికెట్ వస్తుందని ఆశిస్తున్న జయనాగేశ్వర్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందో పరిశీలిస్తే..

జయ నాగేశ్వర్‌ రెడ్డి (TDP) ప్లస్ పాయింట్స్

అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేయడం

కలిసిరానున్న తండ్రి బీవీ మోహన్‌ రెడ్డి రాజకీయ నేపథ్యం

జయహో బీసీ పేరుతో నిర్వహించిన కార్యక్రమం

గత కొన్ని రోజులుగా చాలా యాక్టివ్‌గా ఉండటం

Caste Politics

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కర్ని సామాజిక వర్గ ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 40 శాతం ఉన్న ఓటర్లలో సగం మంది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ సామాజిక వర్గానికి చెందిన మాచని వెంకటేశ్‌ను నియోజకవర్గ ఇంచార్జ్‌గా ప్రకటించడంతో ఈ మద్ధతు మరింత పెరిగింది. నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్న మరో నేత బుట్టా రేణుక కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన నేత. 1990 తర్వాత ఓ బీసీ నేతకు టికెట్ కేటాయించడం ఇదే తొలిసారి. అందుకే చాలా మంది అంటే 50 శాతం మంది వైసీపీకి మద్ధతు పలుకుతున్నట్టు బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఇక 45 శాతం మంది టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు. టీడీపీ హయాంలో లబ్ధి పొందిన వారితో పాటు తెలుగుదేశం పార్టీకి మాములుగానే మద్ధతిచ్చే సాంప్రదాయ ఓటర్లు ఉన్నారు. ఇక మిగిలన 5 శాతం మంది ఇతరులకు ఓటు వేస్తామని తెలిపారు.

22 శాతం ఉన్న ముస్లింలలో అటు వైసీపీకి,ఇటు టీడీపీ కూటమికి సమానంగా మద్ధతిస్తామని తెలిపారు. వైఎస్‌ఆర్ హయాంలో ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్‌ వైసీపీకి అనుకూలంగా ఉండగా.. టీడీపీ హయాంలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు ఆ పార్టీకే మద్ధతు పలుకుతున్నారు.

17 శాతం ఉన్న ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు కూడా 50 శాతం మంది వైసీపీకే మద్ధతు పలుకుతున్నారు. టీడీపీకి 40 శాతం, ఇతరులకు 10 శాతం తమ మద్ధతిస్తున్నారు. 13 శాతం ఉన్న వాల్మీకి బోయల్లో వైసీపీ, టీడీపీ కూటమికి సమంగా మద్ధతిస్తున్నారు. ఈ సామాజిక వర్గ ప్రజలను ఎస్టీల్లో చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం ఓ తీర్మానాన్ని రూపొందించడాన్ని ఆ స్వాగతిస్తున్నారు. అయితే కేవలం తీర్మానం పెట్టి చేతులు దులుపుకున్నారన్న భావనలో ఉన్న మరికొందరు ప్రజలు మాత్రం టీడీపీ కూటమికి సపోర్ట్ చేస్తున్నారు.

ఇక 5 శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గ ప్రజల్లో వైసీపీకి 55 శాతం మద్ధతిస్తున్నారు. గడచిన ఎన్నికల్లో సంఖ్యా పరంగా తక్కువగా ఉన్న పార్టీలు ఇదే సామాజిక వర్గ నేతలకు టికెట్లు కేటాయిస్తూ వస్తున్నాయి. దీంతో ఇరు పార్టీలకు ఈ సామాజిక వర్గ ప్రజలు మద్ధతిస్తున్నారు. అయితే కాస్త ఎక్కువగా వైసీపీని ఆదరిస్తున్నారనే చెప్పాలి. అయితే బీవీ జయ నాగేశ్వర్‌ రెడ్డికి కూడా 40 శాతం మద్దతు పలుకుతున్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిస్తే..

మాచని వెంకటేశ్‌ VS జయ నాగేశ్వర్ రెడ్డి

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి మాచని వెంకటేశ్‌, జయనాగేశ్వర్ రెడ్డి తలపడితే కాస్త ఎడ్జ్‌తో గెలుపు అవకాశాలు వైసీపీకే ఉన్నట్టు బిగ్‌ టీవీ సర్వేలో తేలింది. మాచనికి 46 శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో బీవీ జయనాగేశ్వర్ రెడ్డికి 44 శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు 10 శాతం అవకాశాలు ఉన్నాయి.

మరో సీనరీలో బుట్టా రేణుక, జయనాగేశ్వర్‌ రెడ్డి బరిలోకి దిగితే పరిస్థితి ఎవరి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే..

బుట్టా రేణుక VS జయ నాగేశ్వర్‌ రెడ్డి

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి బుట్టారేణుక, జయనాగేశ్వర్ రెడ్డి బరిలోకి దిగినా కూడా వైసీపీకే గెలుపు అవకాశాలు ఉన్నట్టు బిగ్‌ టీవీ ఎలక్షన్‌ సర్వేలో తేలింది. బుట్టా రేణుకకు 47 శాతం, జయ నాగేశ్వర్‌ రెడ్డికి 44 శాతం గెలుపు అవకాశాలు ఉన్నట్టు తేలింది. ఇతరులకు 9 శాతం మాత్రమే అవకాశం ఉన్నట్టు సర్వే రిపోర్ట్ చెబుతోంది. నిజానికి గత మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 40శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. దీనికి తోడు ఈసారి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపడం.. ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డిపై ప్రజల్లో ఉన్న సానుకూలత ఇవన్నీ కూడా వైసీపీకి కలిసిరానున్నట్టు సర్వే రిపోర్ట్ చెబుతోంది.

.

.

Related News

Nara Devansh: తాతకు తగ్గ మనవడు.. నారా దేవాన్ష్‌కి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు

Rain Alert: ఈ జిల్లాల ప్రజలు అలర్ట్..! భారీ వర్షం, పిడుగులు పడే ఛాన్స్..

Ayyanna Patrudu: మాజీ సీఎం జగన్‌కు.. అయ్యన్నపాత్రుడు చురకలు..

Chicken Price Hike: భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా?

AP Politics: బీజేపీలోకి పోతుల సునీత.. చీరాల టికెట్‌పై కన్ను, తెర వెనుక జగన్?

Turakapalem: తురకపాలెం సాయిల్ పరీక్షల్లో సంచలన విషయాలు

Vahana Mitra scheme: ఏపీ వాహన మిత్ర స్కీమ్.. కొత్త గైడ్ లైన్స్ వచ్చేశాయ్, రూ. 15 వేలు మీ సొంతం

CM Chandrababu: సీఎం చంద్రబాబు సంకేతాలు.. సబ్జెక్టుతో రావాల్సిందే, ఏడు గ్రూపులు ఏర్పాటు

Big Stories

×