BigTV English

IND Vs ENG : కొహ్లీ లేని లోటు.. గిల్ తీరుస్తాడా?

IND Vs ENG : కొహ్లీ లేని లోటు.. గిల్ తీరుస్తాడా?
cricket news today telugu

Ind vs Eng test match update(Cricket news today telugu):


టీమ్ ఇండియా తొలి టెస్ట్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. అయితే అనూహ్యంగా విరాట్ కొహ్లీ పక్కకి తప్పుకోవడంతో అతని ప్లేస్ లో రజిత్ పటీదార్ ను తీసుకుంది. అయినా సరే, తను ధ్రువ్ జురెల్ తో కలిసి డగౌట్ కే పరిమితం అయ్యే అవకాశాలున్నాయి.

ఇప్పుడు కొహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో టాప్ ఆర్డర్ పై ఒత్తిడి తగ్గింది. ఎవరిని తీసుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలనే మీమాంశ టీమ్ మేనేజ్మెంట్ కి తగ్గింది. ఈ రెండు మ్యాచ్ ల్లో వీరిలో ఎవరు సరిగ్గా పెర్ ఫార్మ్ చేయకపోయినా, వారు డగౌట్ కి వెళ్లి కూర్చుంటారు. కొహ్లీ వారి ప్లేస్ లో ఆడతాడు. అది లెక్కని చెబుతున్నారు.


భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, జైశ్వాల్ మధ్య కాంబినేషన్ సరిగ్గా కుదరలేదు. రోహిత్-గిల్ మధ్య వచ్చిన శుభారంభాలు వీరిమధ్యలో లేవు. అందువల్ల తొలిసారి స్వదేశంలో తొలిటెస్ట్ ఆడుతున్న యశస్వి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి.

ఇకపోతే శుభ్ మన్ గిల్ వరుసగా విఫలం కావడంతో జట్టుకి భారంగా మారుతున్నాడు. అంటే అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడేటప్పుడు అవకాశాలు ఇవ్వాలి కాబట్టి, అతను బతికి, ప్యాడ్ కట్టి క్రీజులో అడుగుపెడుతున్నాడు.

ఇప్పుడు గిల్ నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. భవిష్యత్ భారత క్రికెట్ లో ఒక ఆశా కిరణంలా మెరుస్తున్న గిల్ ని అందరూ కొహ్లీకి వారసుడు అని పొగిడేస్తున్నారు. ఇప్పుడదే కొహ్లీ గైర్హాజరీలో తను ఆడుతున్నాడు. ఆ మాట నిలబెట్టాలి. ఆ ఫస్ట్ డౌన్ తనదేనని నిరూపించాలి.

తర్వాత శ్రేయాస్ అయ్యర్ పరిస్థితి గాలి పటంలా రెపరెపలాడుతోంది. ఒకటి మెరుస్తున్నాడు. మరో రెండు గోల్డెన్ డకౌట్ అవుతున్నాడు. కనీసం పట్టుమని పది రన్స్ కూడా చేయడం లేదు. ప్యాడ్లు కట్టినంత సేపు కూడా క్రీజులో ఉండటం లేదు. ఫస్ట్ బాల్ కే వచ్చేస్తున్నాడు.

కేఎల్ రాహుల్ కి ప్రమోషన్ దక్కింది. కీపర్ గా భారం తగ్గింది. ఇప్పుడు తను ఫామ్ లో ఉన్నాడు కాబట్టి, జట్టుకి ఆపద్భాందవుడి పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇంక ఆంధ్రా ఆటగాడు వికెట్ కీపర్ భవితవ్యం ఈ సిరీస్ తో తేలిపోనుంది. కీపర్ గానే కాదు, బ్యాటర్ కూడా రాణించాల్సిన అవసరం ఉంది.

ముగ్గురు స్పిన్నర్లు రవీంద్రజడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ ఆడే అవకాశాలున్నాయి. బుమ్రాతో కలిసి సిరాజ్ పేస్ భారాన్ని మోయనున్నాడు. ఇంగ్లాండ్ బజ్ బల్ వ్యూహంతో వస్తోంది కాబట్టి, వడివడిగా వికెట్లు తీస్తే టీమ్ ఇండియా విజయానికి మార్గం సుగమమం అవుతుందని విశ్లేషకులు వ్యాక్యానిస్తున్నారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×