BigTV English

Chandragiri Assembly Constituency : పులివర్తి నాని VS చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.. చంద్రగిరిలో ఎగిరే జెండా ఏది ?

Chandragiri Assembly Constituency : పులివర్తి నాని VS చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.. చంద్రగిరిలో ఎగిరే జెండా ఏది ?
Andhra news today

Chandragiri Assembly Constituency(Andhra news today) :

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన నియోజకవర్గం చంద్రగిరి. ఈ ప్రాంతానికి చాలా ప్రాధాన్యం ఉంది. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో కాంగ్రెస్ నుంచి ఇక్కడే తొలిసారి గెలిచారు. ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో అతిపెద్ద మామిడి మార్కెట్ దామలచెరువు ఉంది. గల్లా అరుణకుమారి ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు. ప్రస్తుతం ఆమె టీడీపీలో ఉన్నారు. ఈ సెగ్మెంట్ లో కాంగ్రెస్ ఆరు సార్లు, వైసీపీ 2సార్లు గెలిచింది. గత ఎన్నికల్లో ఇదే చంద్రగిరి సెగ్మెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 శాతం ఓట్ షేర్ మెజార్టీతో గెలిచింది. అయితే ఇప్పుడు కూడా ద్విముఖపోరుకు చంద్రగిరి రెడీ అయింది. మరి ఈ నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి VS పులివర్తి వెంకట మణిప్రసాద్


గత ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ నుంచి పులివర్తి వెంకట మణి ప్రసాద్ పోటీ చేశారు. అయితే విజయం జగన్ పార్టీవైపు ఏకపక్షమైంది. గత ఎలక్షన్లలో వైసీపీ వేవ్ ఉండడం, చెవిరెడ్డి ప్రభావంతో ఓట్లన్నీ వైసీపీకి పడ్డాయి. అదే సమయంలో టీడీపీ తరపున పోటీ చేసిన పులివర్తి వెంకట మణి ప్రసాద్ కు టీడీపీ క్యాడర్ లో పెద్దగా కమాండ్ లేకపోవడం, జనసేన నుంచి అభ్యర్థి నిలవడం, ఓట్లు చీలడం వంటి కారణాలతో ఓడిపోయారు. మరి ఈసారి ఎన్నికల్లో చంద్రగిరి సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్లస్ పాయింట్స్

సెగ్మెంట్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పలుకుబడి
పార్టీపై పూర్తి కమాండ్ తో ఉండడం
చంద్రగిరిలో పాదయాత్ర ద్వారా అందరితో మమేకం
గ్రౌండ్ లో తండ్రితో పాటే యాక్టివ్ గా ఉండడం

చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మైనస్ పాయింట్స్

ప్రభుత్వ వ్యతిరేకతకు ఎంత వరకు అడ్డుకట్ట వేస్తారన్న డౌట్లు

పులివర్తి వెంకట మణి ప్రసాద్ ప్లస్ పాయింట్స్

గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి
రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న టీడీపీ వేవ్
ఏడాది కాలంలో సెగ్మెంట్ లో యాక్టివ్
ప్రభుత్వంపై అసంతృప్తి ఓట్ల రూపంలో వస్తుందన్న నమ్మకం

పులివర్తి వెంకట మణి ప్రసాద్ మైనస్ పాయింట్స్

పార్టీలో పట్టు పెంచుకోకపోవడం
గతంలో చిత్తూరు టిక్కెట్ ఆశించడం

Caste Politics

చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం బలంగా ఉంది. ఇందులో 60 శాతం మంది వైసీపీకి మద్దతు పలుకుతామని బిగ్ టీవీ సర్వేలో తెలిపారు. అలాగే టీడీపీకి 35 శాతం మంది, 5 శాతం ఇతరులకు ఓటు వేస్తామన్నారు. ఇక్కడి వైసీపీ అభ్యర్థి రెడ్డి సామాజికవర్గం కావడంతో సహజంగానే ఓట్లు అటువైపు షిఫ్ట్ అవుతున్నాయి. మరోవైపు కమ్మ సామాజికవర్గానికి చెందిన 18 శాతం మందిలో 35 శాతం వైసీపీకి, 60 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతు ఇస్తామని సర్వేలో భాగంగా వెల్లడించారు. ఇక ఎస్సీల్లో 55 శాతం వైసీపీకి, 40 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ గా ఉంటామన్నారు. బలిజ సామాజికవర్గంలో 40 శాతం జగన్ పార్టీకి, 55 శాతం చంద్రబాబు పార్టీకి, 5 శాతం ఇతరులకు మద్దతు ఇస్తామన్నారు. అటు యాదవ సామాజికవర్గంలో 55 శాతం వైసీపీకి, 40 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు మద్దతు ఇస్తామన్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిస్తే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ జెండానే ఎగిరేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ సర్వేలో తేలింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి 47 శాతం, పులివర్తి నానికి 43 శాతం ఓట్లు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరులకు 10 శాతం ఓట్లు వస్తాయని తేలింది. మోహిత్ రెడ్డి పాదయాత్ర చేయడం, నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉండడం, నియోజకవర్గ అభివృద్ది జరగడం, కష్ట సమయాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలకు అండగా ఉండడం, పటిష్టమైన ఓటు బ్యాంకు ఇవన్నీ చంద్రగిరిలో వైసీపీ విజయావకాశాలను మెరుగు పరుస్తాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థికి చంద్రబాబు అరెస్ట్ ఉదంతం సానుభూతి ఓట్లను తెచ్చే అవకాశాలున్నాయని తేలింది. పార్టీకి సంప్రదాయ బద్ధంగా ఉన్న ఓట్ షేర్ కలిసి వచ్చే అంశంగా బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది.

.

.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×