BigTV English

Kakinada Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. కాకినాడలో కాక పుట్టించేదెవరు ?

Kakinada Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. కాకినాడలో కాక పుట్టించేదెవరు ?
Kakinada Assembly Constituency

Bigtv Election Survey in Kakinada Assembly Constituency(Today’s state news) : ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ గా హాట్ హాట్ గా ఉండే సెగ్మెంట్ కాకినాడ సిటీ. ఇక్కడి రాజకీయం రూటే సపరేటు. ఖండాంతరాలు దాటిన కాకినాడ కాజా ఇక్కడి ఫేమస్ స్వీట్. బ్రిటిషర్ల హయాంలో బకింగ్ హామ్ కెనాల్ కాకినాడ, చెన్నై మధ్య ప్రధాన జలమార్గంగా ఉండేది. స్మార్ట్ సిటీ మిషన్ లో భాగంగా ఏపీలోని మూడు స్మార్ట్ సిటీల్లో కాకినాడ కూడా ఒకటి. మరి కాకినాడ అభివృద్ధి జరిగిందా? ఓటర్లు ఏమనుకుంటున్నారు? అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? కాకినాడ నియోజకవర్గం జనం నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (వైసీపీ) గెలుపు VS వనమాడి వెంకటేశ్వరరావు (టీడీపీ)


2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ సిటీలో ఎన్నికలు ఆసక్తికరంగా సాగాయి. వైసీపీ నుంచి సీనియర్ లీడర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బరిలో దిగి 43 శాతం ఓట్లు సాధించి గెలుపొందారు. ఈ గెలుపులో ద్వారంపూడి సొంత ఇమేజ్ తో పాటు వైసీపీ వేవ్ కలిసి వచ్చింది. అదే సమయంలో జనసేన కూడా గట్టి పోటీ ఇవ్వడంతో కాకినాడ సిటీలో వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య త్రిముఖపోరుగా మారిపోయి వైసీపీ అభ్యర్థి ద్వారంపూడికి బెనిఫిట్ జరిగింది. టీడీపీ నుంచి పోటీ చేసిన మరో సీనియర్ లీడర్ వనమాడి వెంకటేశ్వరరావుకు 35 శాతం ఓట్లు, జనసేన నుంచి పోటీ చేసిన ముత్తా శశిధర్ కు 18 శాతం ఓట్లు వచ్చాయి. కాకినాడలో కాపు కమ్యూనిటీ ఓట్లు 26 శాతంగా ఉన్నాయి. నిజానికి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మరి ఇప్పుడు మారిన సమీకరణాలు, కుదిరిన పొత్తుల నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో కాకినాడ సిటీ సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (YCP) ప్లస్ పాయింట్స్

కాకినాడలో బలమైన నేతగా గుర్తింపు

సహాయం కోరి వచ్చిన వారికి సొంత నిధుల కేటాయింపు

అన్ని సామాజికవర్గాలను సమానంగా చూడడం

కాకినాడ అభివృద్ధిపై జనంలో సంతృప్తి

వైసీపీ క్యాడర్ నుంచి ద్వారంపూడికి ఫుల్ సపోర్ట్

అనుచరులను మంచిగా చూసుకోవడం

కాకినాడలో పార్టీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడం

కాకినాడ సెగ్మెంట్ లో సొంతంగా కంటి పరీక్షలు చేయించడం

ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించడం

నాడు నేడులో భాగంగా స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మైనస్ పాయింట్స్

కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజ్ పైపులు సరిగా లేకపోవడం

వర్షాకాలంలో రోడ్లపైనే డ్రైనేజ్ నీటి ప్రవాహం

కొన్ని ఏరియాల్లో సీసీ రోడ్లు అధ్వాన్నంగా మారడం

వనమాడి వెంకటేశ్వరరావు (TDP) ప్లస్ పాయింట్స్

సీనియర్ టీడీపీ నేతగా జనంలో గుర్తింపు

ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం

క్యాడర్ నుంచి బలమైన మద్దతు ఉండడం

గత ఏడాది కాలం నుంచి యాక్టివ్ గా ప్రచారం

వనమాడి వెంకటేశ్వరరావు మైనస్ పాయింట్స్

ప్రత్యర్థిని ఎంత వరకు తట్టుకుంటారన్న డౌట్లు

పొత్తులో భాగంగా టిక్కెట్ ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి

ముత్తా శశిధర్ (JSP) ప్లస్ పాయింట్స్

పబ్లిక్ లో శశిధర్ కు మంచి ఇమేజ్

ప్రజల సమస్య వింటారన్న అభిప్రాయం

ప్రభుత్వ విధానాలపై పోరాడడం

అంగన్వాడీ నిరసనల్లో పాల్గొనడం

కాకినాడ యూత్ లో శశిధర్ కు మంచి ఫాలోయింగ్

జనసేన క్యాడర్ నుంచి బలమైన మద్దతు

ముత్తా శశిధర్ మైనస్ పాయింట్స్

పొత్తులో భాగంగా టిక్కెట్ దక్కడంపై అనుమానం

ఇక వచ్చే ఎన్నికల్లో కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం.

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి VS వనమాడి వెంకటేశ్వరరావు (టీడీపీ)

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాకినాడ సిటీలో వైసీపీ నుంచి ద్వారంపూడి, టీడీపీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తే టీడీపీ గెలిచేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థికి 44 శాతం ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 49 శాతం ఓట్లు, ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సినారియోలో టీడీపీకి ఎక్కువ ఓట్ షేర్ రావడానికి కారణం టీడీపీ జనసేన పొత్తులే. కాకినాడలో కాపు కమ్యూనిటీ జనాభా 26 శాతంగా ఉంది. పైగా ఇక్కడ వైసీపీ అభ్యర్థిని ఓడించేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పట్టుదలగా కనిపిస్తున్నారు. దీంతో టీడీపీ, జనసేన మధ్య ఓట్ల బదిలీ పకడ్బందీగా జరిపించేలా జాగ్రత్త పడుతున్నారు. అలాగే మత్స్యకార, కాపు, వైశ్య కమ్యూనిటీ ఓట్లు తమవైపు ఉండేలా ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఓట్లపై వైసీపీ నమ్మకంతో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి పాజిటివ్ ఇమేజ్ కొంత వరకు కలిసి వస్తోంది.

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి VS ముత్తా శశిధర్ (జనసేన)

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాకినాడలో వైసీపీ నుంచి ద్వారంపూడి, జనసేన నుంచి ముత్తా శశిధర్ బరిలో దిగితదే వైసీపీ గెలిచేందుకు ఛాన్సెస్ ఎక్కువున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఈ లెక్కన వైసీపీ అభ్యర్థికి 45 శాతం ఓట్లు, జనసేన అభ్యర్థికి 41 శాతం ఓట్లు, ఇతరులకు 14 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ ఓట్ షేర్ కు కారణం.. సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉన్న పాజిటివ్ ఇమేజ్. అలాగే అభివృద్ధి పనులు చేపట్టడం, ప్రభుత్వ పథకాలు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తున్నాయి. ఇక జనసేనకు కలిసి వచ్చే పాయింట్స్ లో టీడీపీ, జనసేన పొత్తు ఒకటైతే, కాపు సహా ఇతర సామాజికవర్గాల సపోర్ట్ ఉంటుండం కలిసి వచ్చేలా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఇమేజ్ తో యూత్ ఓట్లు వచ్చేందుకు ఆస్కారం కనిపిస్తోంది.

Related News

Nellore News: ఆస్పత్రిలో ఖైదీ రాసలీలలు.. ఏకంగా హాస్పిటల్ బెడ్ పైనే.. ఏంటీ దారుణం?

Weather News: వాయుగుండంగా అల్పపీడనం..! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతవారణశాఖ

RK Roja: వార్-2 సినిమాను అడ్డుకుంటారా..? రోజా సంచలన వ్యాఖ్యలు

Vizag Rainfall: మరో 3 రోజుల వర్షాలు.. విశాఖ వాసులకు టెన్షన్ పెంచుతున్న వాతావరణం!

NTR fans protest: అనంతపురంలో ఉద్రిక్తత.. బహిరంగ క్షమాపణకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్!

MLA Daggubati Prasad: ఆ ఆడియో నాది కాదు.. కానీ సారీ అంటూ ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే!

Big Stories

×