BigTV English

Ravindra Jadeja: నన్ను క్షమించు భయ్..! సర్ఫరాజుకి చేతులెత్తిదండం పెట్టిన జడేజా..

Ravindra Jadeja: నన్ను క్షమించు భయ్..! సర్ఫరాజుకి చేతులెత్తిదండం పెట్టిన జడేజా..
Ravindra Jadeja news

Ravindra Jadeja’s Apology After Sarfaraz Khan’s Run Out(Sports news headlines): రవీంద్ర జడేజా ఆటలో ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. సరదాగా నవ్విస్తుంటాడు. కవ్విస్తుంటాడు. జిమ్మిక్కులు చేస్తుంటాడు. ఫీల్డింగ్‌లో ఎంతో ఎనర్జటిక్‌గా ఉంటాడు. బెస్ట్ ఫీల్డర్ అవార్డులు ఎన్నో అందుకున్నాడు.  ఒక ఆఫ్ సెంచరీ చేసినా, సెంచరీ చేసినా బ్యాట్‌తో కర్రసాము చేస్తుంటాడు. ఒకటి కాదు.. ఇలాంటివెన్నో.. తను మ్యాచ్‌లో ఉంటే మజాయే వేరుగా ఉంటుంది. కానీ ఈ సారి దానికి కంప్లీట్ రివర్స్ నడిచింది.


ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టు తొలిరోజు సెంచరీ చేసిన రవీంద్ర జడేజా ఆ ఆనందాన్ని అనుభవించలేకపోయాడు. అందుక్కారణం అద్భుతంగా ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్‌ని రన్ అవుట్ చేయడమే. నిజానికి గిల్, రజత్, యశస్వి అందరూ తడబడిన పిచ్‌పై తను అలవోకగా పరుగులు చేశాడు.

Read More: ఆటలో అలాంటివి సహజం.. రనౌట్‌పై స్పందించిన సర్ఫరాజ్..


ఫోర్లు, సిక్స్‌తో  స్కోరుబోర్డుని పరుగులెత్తించాడు. అలాంటి సర్ఫరాజ్ మరికొంత సేపు క్రీజులో ఉంటే ఆట స్వరూపమే మారిపోయేది. అంతటి సువర్ణావకాశాన్ని రవీంద్ర జడేజా పాడు చేశాడని కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెట్టింట కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఈ క్రమంలో ఇన్‌స్టాలో రవీంద్ర జడేజా ఒక పోస్ట్ పెట్టాడు. రెండు చేతులెత్తి నమస్కరించి, నా వల్ల పొరపాటు జరిగింది. నన్ను క్షమించు సర్ఫరాజ్ భయ్.. అంటూ రాసుకొచ్చాడు.  ఇది నా తప్పిదమే. బాల్ ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది లేనిది చూసిన తర్వాత రన్ చేయాల్సింది.  కానీ క్విక్ సింగిల్ తీయాలని భావించి, పిలిచానని అన్నాడు. అయితే అద్భుతంగా ఆడుతున్న సర్ఫరాజ్‌ని అవుట్ చేయడంతో  చాలా బాధనిపించిందని రాసుకొచ్చాడు.

సర్ఫరాజ్ ఖాన్ రనౌట్‌గా వెనుదిరగడం చూసి అతని తండ్రి, భార్యతో పాటు రోహిత్ శర్మ కూడా తట్టుకోలేకపోయాడు. చివరకు రవీంద్ర జడేజా సైతం బాధపడ్డాడు. ఆ తర్వాత బంతికే అతను సెంచరీ పూర్తి చేసుకున్నా.. సెలెబ్రేట్ చేసుకోలేదు. ఇప్పుడు జడేజా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×