BigTV English

Nellore City Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. నెల్లూరు సిటీలో నవాబు అయ్యేదెవరు?

Nellore City Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. నెల్లూరు సిటీలో నవాబు అయ్యేదెవరు?
Nellore City Constituency

Big Tv Survey on Nellore City Constituency (political news telugu):


ఏపీ రాజకీయాల్లో సింహపురి పాలిటిక్స్ రూటే సపరేటు. ఇక్కడ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయం రంజుగా మారుతుంటుంది. ఇప్పుడు కూడా టీడీపీ, వైసీపీ మధ్య ద్విముఖపోరుకు రంగం సిద్ధమైంది. 2014, 2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు. అయితే ఆయనను ఇప్పుడు నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని వైసీపీ హైకమాండ్ ఆదేశించడంతో సింహపురి రాజకీయం మారిపోయింది. పొలిటికల్ చెక్ మేట్ పెట్టడానికి వైసీపీ మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపితే.. గత ఎన్నికల్లో పోరాడి ఓడిన అభ్యర్థినే టీడీపీ రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. మరి నెల్లూరు సిటీ నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.

అనిల్ కుమార్ యాదవ్ (గెలుపు) VS పి.నారాయణ


2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ 47 శాతం ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థిపై గెలిచారు. టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణకు 46 శాతం ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి కేతం రెడ్డి వినోద్ రెడ్డి 3 శాతం ఓట్లు సాధించారు. ఇతరులకు 4 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ గెలుపులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి నాయకుల సపోర్ట్ చాలా పని చేసింది. అదే సమయంలో నారాయణ కూడా గట్టిపోటీనే ఇచ్చారు. కాపు సామాజికవర్గం సహా టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకు అంతా నారాయణవైపే ఉంది. మరి ఈసారి ఎన్నికల్లో నెల్లూరు సిటీ సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

మహ్మద్ ఖలీల్ అహ్మద్ (YCP) ప్లస్ పాయింట్స్

సుదీర్ఘ రాజకీయ అనుభవం
నెల్లూరులో మైనార్టీల మద్దతుపై ఆశలు
జగన్ ప్రభుత్వ పథకాల లబ్దిదారుల ఓట్లపై ఆశలు
నెల్లూరు డిప్యూటీ మేయర్ గా విధులు
జనంలో గుర్తింపు ఉన్న లీడర్ గా పేరు

మహ్మద్ ఖలీల్ అహ్మద్ మైనస్ పాయింట్స్

బలమైన ప్రత్యర్థిని ఎలా ఎదుర్కొంటారన్న సందేహం
నెల్లూరు సిటీలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం
సీసీ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారడం
వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోతుండడంతో ప్రయాణాలకు సమస్య

పి.నారాయణ (TDP) ప్లస్ పాయింట్స్

నియోజకవర్గంలో పేరున్న నేతగా గుర్తింపు
మంత్రిగా ఉన్నప్పుడు రూ.5 వేల కోట్లతో నెల్లూరు అభివృద్ధి
నారాయణ తీరుపై టీడీపీ క్యాడర్ లో సంతృప్తి
నియోజకవర్గ సమస్యలపై ఎప్పటికప్పుడు ఆరా

పి. నారాయణ మైనస్ పాయింట్స్

నెల్లూరు టీడీపీ గ్రూపులుగా విడిపోవడం

ఇక వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

మహ్మద్ ఖలీల్ అహ్మద్ VS పొంగూరు నారాయణ

ఇప్పటికిప్పుడు నెల్లూరు సిటీలో ఎన్నికలు జరిగితే గెలుపు అవకాశాలు టీడీపీవైపే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణకు 51 శాతం ఓట్లు, వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ కు 44 శాతం ఓట్లు, ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. టీడీపీ అభ్యర్థి నారాయణకు గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కనిపిస్తోంది. అదే సమయంలో ఓడినప్పటికీ గతంలో ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా పని చేసిన టైంలో 5 వేల కోట్లతో నెల్లూరును అభివృద్ధి చేయడం ప్లస్ పాయింట్ గా మారుతోంది. వైసీపీ ప్రభుత్వంపై యాంటీ ఇంకుంబెన్సీ కూడా టీడీపీ ఎడ్జ్ పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ నుంచి మహ్మద్ ఖలీల్ అహ్మద్ ను నియోజకవర్గ ఇంఛార్జ్ గా కేటాయించారు. అటు వైసీపీ టిక్కెట్ కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం పోటీ పడుతున్నా.. వారికి ఎంపీ టిక్కెట్ ఇస్తామని చెప్పి కూల్ చేశారు.

Related News

Fishermen Vs Police: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు Vs పోలీసులు

Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. విశాఖకు పదేళ్లు చాలు: లోకేష్

Anantapur: దారుణం.. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి

YSRCP vs TDP: బొత్స ‘అంతం’ మాటలు.. జగన్ ప్లాన్‌లో భాగమేనా?

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

Big Stories

×