BigTV English

Students Suicide: విషాదం.. ఎస్సీ హాస్టల్ లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య

Students Suicide: విషాదం.. ఎస్సీ హాస్టల్ లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య

Students Suicide Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌కు చెందిన కోడి భవ్య(15), హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన కడే వైష్ణవి (15) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భువనగిరి పట్టణంలోని రెడ్డివాడ బాలికోన్నత పాఠశాలలో వీరు పదవ తరగతి చదువుతున్నారు. ప్రతిరోజూ మాదిరిగానే శనివారం (ఫిబ్రవరి 3)న పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు తిరిగి సాయంత్రానికి హాస్టల్ కు వచ్చారు. ఆపై వసతిగృహంలో నిర్వహించే ట్యూషన్ కు హాజరు కాలేదు. ట్యూషన్ టీచర్ ఇద్దరిని పిలువగా.. రాత్రి భోజనం చేసిన తర్వాత వస్తామని చెప్పి.. గది నుంచి బయటకు రాలేదు.


భోజన సమయంలో ఇద్దరూ కనిపించకపోవడంతో.. ఒక విద్యార్థిని వారి గదివద్దకు వెళ్లి చూడగా.. ఇద్దరూ ఫ్యాన్లకు ఉరివేసుకుని.. వేలాడుతూ కనిపించారు. వెంటనే హాస్టల్ సిబ్బందికి సమాచారమివ్వగా.. 108 ను రప్పించి.. ఇద్దరినీ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినులను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కాగా.. తాజాగా ఈ ఘటనలో సూసైడ్ లెటర్ లభించింది. చేయని తప్పునకు అందరూ తమని మాటలు అనడం తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వారు రాసుకొచ్చారు.

“మేం వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి. మేం తప్పు చేయకపోయినా అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం. మమ్మల్ని మా శైలజ మేడమ్ తప్ప ఎవరూ నమ్మలేదు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక.. ఇలా వెళ్లిపోతున్నాం. మా ఇద్దరినీ ఒకేచోట సమాధి చేయండి” అని లభ్యమైన సూసైడ్ నోట్ లో రాసి ఉంది.


అయితే మరోవైపు విద్యార్ధినులు మృతి చెందినట్లు పోలీసులు సమాచారం ఇవ్వలేదంటూ వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమకు విషయం వెల్లడించకుండా హాస్పిటల్ కి వారి మృతదేహాలను చేర్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు విద్యార్ధినులు ఘాతుకానికి పాల్పడుతుంటే హాస్టల్ సిబ్బంది ఎక్కడికి వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. హాస్టల్ వార్డెన్ శైలజ, ట్యూషన్ టీచర్ ను భువనగిరి టౌన్ ఇన్ స్పెక్టర్ సురేష్ కుమార్, ఎస్సై నాగరాజు, డీఈఓ నారాయణరెడ్డి విచారిస్తున్నారు.

హాస్టల్ లో జరిగిన గొడవ కారణంగానే ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని డీఈఓ తెలిపారు. నలుగురు విద్యార్థినులు.. భవ్య, వైష్ణవిలు తమను దూషించి చేయి చేసుకున్నారని పాఠశాలలోని ఉపాధ్యాయురాలికి చెప్పడంతో.. శనివారమే వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. తమ తప్పలేకపోయినా తమపై ఫిర్యాదు చేయడాన్ని అవమానంగా భావించి.. విద్యార్థినులు బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక బాలికల మృతదేహాలను చూసి వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Tags

Related News

Chirala Beach Accident: బీచ్‌లో విషాదం.. స్నానం చేస్తూ ఐదుగురు మాయం

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

Tirupati Drug Case: పాడుబడ్డ బంగ్లాలో డ్రగ్స్ తీసుకుంటూ.. ఇద్దరు యువకులు అరెస్ట్

Siddipet Crime: పెళ్లయిన 13 రోజులకే ప్రెగ్నెంట్.. డాక్టర్ సమాధానంతో భర్త షాక్, ఏం జరిగింది?

Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి

Sangareddy News: కిలేడీ విద్య ఎక్కడ? జాబితాలో సినీ-బిల్డర్లు? పోలీసులపై అనుమానాలు?

Medak District: దారుణం.. పని ఇస్తామని నమ్మించి.. మహిళపై అత్యాచారం

Warangal Crime: బీటెక్‌ విద్యార్థిని సూసైడ్.. అసలు కారణం అదేనా?

Big Stories

×