AP BJP: బీజేపీ నిర్ణయాలు చాలామందికి అంతుబట్టవు. బయట ప్రచారం ఒకలా సాగుతోంది. నిర్ణయాలు మరోలా ఉంటాయి. తాజాగా ఏపీ బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ప్రకటన కూడా ఇచ్చేసింది. మంగళవారం మధ్యాహ్నం ఆయన తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇంతకీ వెంకట సత్యనారాయణ గురించి డీటేల్స్‌లోకి వెళ్లొద్దాం.
ఏపీ బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా
విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ సీటు ఖాళీ అయ్యింది. అందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిపోయింది. నామినేషన్ గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. సోమవారం రాత్రి బీజేపీ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ పేరు వెల్లడించింది బీజేపీ హైకమాండ్. ఆయన పేరు చూసి చాలామంది షాకయ్యారు. పాకాను ఎంపిక చేస్తారని పార్టీలో కొందరికి మాత్రమే తెలుసు.
అసలే సౌత్‌లో ప్రాంతీయతత్వం ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో పొరుగునున్న తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకి ఛాన్స్ ఇస్తే, నేతల్లో అసంతృప్తి వస్తుందని భావించింది బీజేపీ. ఈ సీటు కోసం ఏపీ నుంచి దాదాపు అరడజను మంది నేతలు పార్టీ పెద్దలతో తమకు తెలిసినవారు ద్వారా లాబీయింగ్ చేశారు. కాకపోతే ఏ ఒక్కరికీ హామీ ఇవ్వలేదు.
కేడర్‌కు సంకేతాలు
సరే చూద్దాం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. పార్టీ నమ్మకుంటే అవకాశాలు ఇస్తామని పాకా ద్వారా మరోసారి నిరూపించింది. నమ్మకుంటే అందలం ఎక్కిస్తామని కేడర్‌కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. వివాదాలకు పోకుండా సైలెంట్‌గా ఉన్నవారికి పదవులు ఖాయమని పాకా ద్వారా నిరూపితమైంది.
ALSO READ: మన స్వర్ణాంధ్రకు గూగుల్ ఎక్కడంటే.. సీఎం చంద్రబాబు శుభవార్త
ఎవరు పాకా వెంకట సత్యనారాయణ అన్నది చాలామంది తెలీదు. ప్రస్తుతం ఆయన ఏపీ బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన సొంతూరు వెస్ట్ గోదావరి జిల్లా. 1983లో భీమవరం కౌన్సిలర్‌గా పని చేశారు. నాలుగు దశాబ్దాల పాటు ఆయన బీజేపీని నమ్ముకున్నారు. పార్టీలో ఎన్ని సమస్యలు వచ్చినా నమ్ముకుని ఉండిపోయారు ఆయన.
బీజేపీ ఎంపికలు అలాగే ఉంటాయా?
మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజును అదే విధంగా ఎంపిక చేసింది బీజేపీ. చివరి నిమిషంలో ఆయన పేరు తెరపైకి వచ్చింది. ఆఘుమేఘాల మీద అమరావతి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. అప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఢిల్లీలో ఉన్నారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ బీజేపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అలాగే వ్యవహరించింది. చివరి నిమిషంలో పశ్చిమ గోదావరి నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మను ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించింది. అంతేకాదు ఏకంగా ఆయనను కేంద్ర కేబినెట్‌లో తీసుకుని సహాయమంత్రిగా ఛాన్స్ ఇచ్చింది. ఈ లెక్కన చూస్తుంటే బీజేపీ ఎక్కువగా ఉమ్మడి తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల వైపు దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.
Congratulations to Shri Paka Venkata Satyanarayana Ji on being selected for the Rajya Sabha bye-election from Andhra Pradesh. @BJP4India @BJP4Andhra pic.twitter.com/HowrF5Zize
— Nune Balraj (@NuneBalrajBjp) April 28, 2025