CM Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. త్వరలో విశాఖకు గూగుల్ రాబోతోందని, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఏపీ మారబోతోందని చంద్రబాబు చెప్పారు.
విశాఖకు ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా రాబోతోందని, దేశంలోనే ఎక్కువగా స్టీల్ ఉత్పత్తి వైజాగ్‌లోనే జరగబోతోందని ఆయన స్పష్టం చేశారు. విశాఖకు కొత్త ఎయిర్ పోర్ట్, మెట్రో వస్తున్నాయని… ఓవైపు అమరావతిలో చేసేవి చేస్తూనే, విశాఖనూ అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
ప్రస్తుతం ఎక్కడ చూసిన దునియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ఒకానొక సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏ స్థాయిలో ప్రభావం చూపించిందో.. ప్రస్తుతం అదే స్థానాన్ని ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తీసుకుంటోంది. ఈ మార్పును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రహించారు. ఈ క్రమంలో ఏపీలో ఏఐ సాంకేతికతను రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించే దిశగా సీఎం ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర రాజధాని నగరం అయిన అమరావతిని ఏఐ క్యాపిటల్ గా తీర్చిదిద్దే పనిలో చంద్రబాబు పడ్డారు. అలాగే డేటా ఎనలాటిక్స్ లాంటి ఆధునిక రంగాల్లో విశాఖను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని పట్టుదలతో ఉన్నారు.
ఈ రోజు అమరావతిలోని వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కొత్త భవనాలను ప్రారంభించిన అనందరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అమరావతితో పాటు వైజాగ్ నగరాన్ని కూడా ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని తమ ముందు ఉన్న లక్ష్యం అని సీఎం అన్నారు. ఈ క్రమంలోనే ప్రపంచంలో ఫేమస్ కంపెనీ అయిన గూగుల్ త్వరలో విశాఖలో అడుగు పెట్టబోతుందని క్లారిటీ ఇచ్చారు.
త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతుందని చెప్పారు. నగరానికి గూగుల్ వచ్చేసరికి, విశాఖ డేటా ఎనలాటిక్స్ లో ప్రపంచానికి కేంద్ర బిందువుగా మారుతుందని చెప్పారు. ఏఐ ఆధారిత డేటా ఎనలాటిక్స్ విశాఖ నుంచి డెవలప్ చెందుతోందని సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: TGPSC Group-1: అలెర్ట్.. గ్రూప్-1 నియామకాలపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం