OTT Movie : హర్రర్ సినిమాలంటే పడి చచ్చే మూవీ లవర్స్ కోసమే ఈ మూవీ. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలోని హారర్ సీన్స్ చూస్తే ఎంతటి ధైర్యవంతులైనా దడుచుకోవాల్సిందే. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? అనే వివరాల్లోకి వెళ్తే…
ఓటీటీలో రెంట్ కి అందుబాటులో…
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు ‘సిజ్జీన్’ (Siccîn). టర్కీ దర్శకుడు అల్పర్ మెస్ట్చీ రూపొందించిన సూపర్ న్యాచురల్ హారర్ చిత్రం. 2014లో రిలీజ్ అయిన ఈ మూవీ టర్కీ హారర్ ఫ్రాంచైజ్‌లో మొదటి చిత్రం. ఇస్లామిక్ పురాణాలు, బ్లాక్ మ్యాజిక్, ఆత్మల గురించిన నమ్మకాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ఓజ్నూర్ అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన కజిన్ కుద్రెట్ ను ప్రేమిస్తుంది. కానీ అదే తరువాత భయంకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో రెంట్ లేదా బై ఆప్షన్‌తో అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే…
ఓజ్నూర్ ఒక అందమైన మహిళ. ఆమె తన చిన్నతనం నుండి కజిన్ కుద్రెట్ ను ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ కుద్రెట్ మాత్రం నిసా అనే మరో మహిళను వివాహం చేసుకుంటాడు. అతనికి ఒక గుడ్డి కూతురు పుడుతుంది. అలాగే అనారోగ్యంతో ఉన్న అత్తమామలు, ఫ్యామిలీతో సంతోషంగా జీవిస్తాడు. నిసా అనారోగ్యంతో ఉన్న తన తల్లి, కుమార్తెను చూసుకోవడానికి ఇంటికే పరిమితమవుతుంది. ఇక పని చేసుకుని కుద్రెట్ రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తాడు.
ఓజ్నూర్ కుద్రెట్ పట్ల తనకున్న ప్రేమను మనసులో పెట్టుకుని, అతన్ని తనవైపుకు తిప్పుకోవడానికి బ్లాక్ మ్యాజిక్ చేసే వ్యక్తిని సంప్రదిస్తుంది. కుద్రెట్ ఆమెకు సరిపోడని, ఆమె నాశనానికి అదే కారణం కావచ్చని మాంత్రికుడు హెచ్చరిస్తాడు. ఈ హెచ్చరికను పట్టించుకోకుండా, ఓజ్నూర్ ముందడుగు వేస్తుంది. చేతబడి చేయించి ఓజ్నూర్ తో ఎఫైర్ పెట్టుకుంటుంది. ఒకవేళ తను ప్రెగ్నెంట్ అయితే అతను తనను పెళ్లి చేసుకోక తప్పదు అని ప్లాన్ వేస్తుంది.
Read Also : రీల్ కాదు రియల్ ఈ మూవీ… షూటింగ్ అని చెప్పి హీరోని ఇలా లేపేశారేంటి భయ్యా
కానీ ఆమెకు అబార్షన్ కావడంతో నిరాశ చెందుతుంది. పైగా కుద్రెట్‌ను సొంతం చేసుకోవాలనే అత్యాశతో, ఓజ్నూర్ మళ్లీ మాంత్రికుడి దగ్గరకు వెళ్ళి, అతన్ని డబ్బుతో కొనేస్తుంది. దీంతో అతను ఒక భయంకరమైన శాపాన్ని కుద్రెట్ ఫ్యామిలీకి ఇస్తాడు. ఈ శాపం ఊహించని సమస్యలను తెచ్చిపెడుతుంది. భయంకరమైన దెయ్యాలు ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది. మరి కుద్రెట్, అతని భార్య ఈ శాపం నుంచి తప్పించుకోగలిగారా? చివరికి ఓజ్నూర్ ఏం చేసింది? అసలు ఆ శాపం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ మూవీని చూసి తీరాల్సిందే.