BigTV English

Bonda Uma : ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని నాశనం చేశారు.. ప్రభుత్వంపై బోండా ఉమ ఫైర్

Bonda Uma: ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలంటూ రాష్ట్రమంతా తిరిగిన జగన్‌.. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో తెదేపా నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభలో ఆయన ప్రశంగించారు. జగన్‌ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. దీంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నరన్నారు.

Bonda Uma :  ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని నాశనం చేశారు.. ప్రభుత్వంపై బోండా ఉమ ఫైర్

Bonda Uma : ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలంటూ రాష్ట్రమంతా తిరిగిన జగన్‌.. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో టీడీపీ నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభలో ఆయన ప్రసంగించారు. జగన్‌ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని.. దీంతో సాధారణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు.


జగన్‌ పాలనలో రాష్ట్రంలో అంతులేని అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల జీవితాలు దారుణంగా తయారయ్యాయని విమర్శించారు. పన్నుల పేరిట ప్రజలపై ఆర్థిక భారం వేశారని దుయ్యబట్టారు. ప్రజలు కడుతున్న ఆ ఆదాయమంతా ఏమైంది? అభివృద్ధి అంటూ రూ.12లక్షల కోట్ల రుణాలు తీసుకొచ్చారు. ఆ డబ్బును ఏం చేశారో ప్రభుత్వం చెప్పడం లేదన్నారు. భవన నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు టీడీపీ హయాంలో ఇసుకను ఉచితంగా ఇచ్చామన్నారు. అయితే ఇప్పుడు వైసీపీ నేతలు ఇసుకతో వ్యాపారం చేస్తూ డబ్బు దోచుకుంటున్నారన్నారు.

గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మద్యం పాలసీ పారదర్శకంగా అమలు చేసేదన్న ఆయన.. ఇప్పుడు ప్రతి డిస్టిలరీని వైసీపీ నేతలు నడుపుతున్నారని పేర్కొన్నారు. మద్యం ద్వారానే రూ.60వేల కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది విమర్శించారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రజలకు చాలా కీలకమైందన్నారు. జగన్ అరాచక పాలన నుండి ప్రజలను కాపాడాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. టీడీపీ-జనసేన కూటమిని ప్రజలు అధికారంలోకి తీసుకురావాలని అని బోండా ఉమ ప్రజలను కోరారు.


ప్రజల రక్తాన్ని జగన్‌ జలగలా పీల్చుతున్నారని జనసేన నేత పోతిన మహేశ్‌ విమర్శించారు. వైసీపీ ఓడిపోవడం ఖాయమని చెప్పారు. రాష్ట్రంలో వివిధ రకాల కొత్త పన్నులతో ప్రజల నుండి డబ్బు ను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల రక్తాన్ని జగన్‌ జలగలా పీల్చుతున్నారని విమర్శలు గుప్పించారు. త్వరలోనే ఆయన శాశ్వత నివాసం అయిన లోటస్‌పాండ్‌కు వెళ్లాల్సిందేనన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని పేర్కొన్నారు.

Related News

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Big Stories

×