BigTV English

Street Dogs : మళ్లీ మొదలైన కుక్కల బెడద.. నిజాంపేటలో తండ్రీకూతుళ్లపై దాడి..

Street Dogs : మళ్లీ మొదలైన కుక్కల బెడద.. నిజాంపేటలో తండ్రీకూతుళ్లపై దాడి..

Street Dogs : హైదరాబాద్ నగరంలో మళ్ళీ కుక్కల బెడద మొదలైంది. గతంలో పలుమార్లు చిన్నారులపై కుక్కలు దాడి చేసిన ఘటనలో పలువురు మృతి చెందడంతో హాట్ టాపిక్ గా మారిన విషయం.. మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. రోజు ఈ తరహా ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది. కుక్కల దాడి ఘటనలో పలువురు ప్రాణాలను కోల్పోగా.. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు.


కాగా ఆదివారం ఉదయాన్నే నిజాంపేట‌లో తండ్రీ కూతుళ్ల‌పై వీధికుక్క దాడి చేయడం కలకలం రేపింది. నిజాంపేటలోని భండారీ లే అవుట్‌కు చెందిన న‌రేష్‌ కుమార్, అతని కూమార్తెపై వీధి కుక్క దాడి చేసింది. న‌రేష్‌కుమార్ అనే వ్యక్తి కాలిని కొరికి కండ పీకేసింది. తండ్రితోపాటు ఐదేళ్ల కూమార్తెకు తలకు కూడా గాయాలయ్యాయి. గత నెలలో ఇదే కాలనీలో పార్కు వద్ద ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిని వీధి కుక్క లాకెళ్లింది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుతం నిజాంపేట్ రోడ్డు లోని హోలీ స్టిక్ ఆస్పత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×