E-Paper
Advertisement

ట్రావెల్ బస్సు బోల్తా, స్పాట్‌లో 40 మంది ప్రయాణికులు, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో ఘోర ప్రమాదాలు

ట్రావెల్ బస్సు బోల్తా, స్పాట్‌లో 40 మంది ప్రయాణికులు, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో ఘోర ప్రమాదాలు
Advertisement

Road Accident: అసలే శీతాకాలం.. పొగ మంచు కారణంగా రోడ్లు సరిగా కనిపించని పరిస్థితి ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా వాహనాన్ని నడపాల్సిన డ్రైవర్లు, మొద్దు నిద్ర వీడడం లేదు. తాజాగా గురువారం ఉదయం అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

అనంతపురం, పల్నాడు జిల్లాల్లో ఘోర ప్రమాదాలు

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ట్రావెల్ బస్సు బయలు దేరింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రామనేపల్లి ప్రాంతానికి బస్సు రాగానే ఒక్కసారిగా బోల్తాపడింది. ఘటన సమయంలో బస్సులో దాదాపు 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో చాలామంది గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ప్రయాణికులు స్వయంగా చెబుతున్నారు.

ముగ్గురు మృతి, 30 మంది వరకు గాయాలు

Advertisement

ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గాయపడిన వారిని అంబులెన్సులో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఘటన తర్వాత బస్సు డ్రైవర్ పరారైనట్టు సమాచారం.

మరోవైపు పల్నాడు జిల్లా గామాలపాడు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి డివైడర్‌ని ఢీ కొట్టింది. ఆ తర్వాత అవతల వైపు వెళ్తున్న ఓ డీసీఎం వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలు, క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

Advertisement

ALSO READ: ఏపీకి బిగ్ రిలీఫ్.. అక్వాన్ తుపాను ముప్పు తప్పినా.. ఆ ఆరు జిల్లాలకు వాన గండం!

 

Related News

ఏపీకి బిగ్ రిలీఫ్.. అక్వాన్ తుపాను ముప్పు తప్పినా.. ఆ ఆరు జిల్లాలకు వాన గండం!

భార్యకు సర్పంచ్‌గా అవకాశం దక్కలేదని భర్త ఆత్మహత్య!

ఆ రెండింటి మధ్య తేడా నీకు తెలీదా.. జగన్ పై నారా లోకేష్ సెటైర్లు!

రామోజీ జయంతి జీవో వివాదం.. సీఎం చంద్రబాబుకు అంబటి చురకలు!

కూటమి ప్రభుత్వం పై హైకోర్టు ఫైర్.. వైసీపీ పార్టీకి గుడ్ న్యూస్?

లోకేష్‌కు బిజినెస్ సమ్మిట్లపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదా?: పేర్ని నాని

ఆరు నెలలకే ప్రపంచ రికార్డు.. బుడిబుడి అడుగుల్లో బుల్లి సంచలనం!

Big Stories

Advertisement
×