AP Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇటు అధికారి పార్టీ అయిన కూటమి ప్రభుత్వం మరో పక్క వైసీపీ పార్టీ నాయకులు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తూ పోటీ చేస్తున్నారు. వైసీపీ పార్టీకి హైకోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. పులివెందులలో టీడీపీ ప్రభుత్వం అల్లర్లు చేస్తూ నామినేషన్లు అడ్డగింతపై వైసీపీ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే వేంపల్లి, చక్రాయపేటల్లో నామినేషన్ల అడ్డగింతపై వైసీపీ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. రెండు మండలాల్లో దాదాపుగా 21 గ్రామ పంచాయతీల్లో అభ్యర్థులను అడ్డుకున్నారని వైసీపీ పార్టీ తమ ఫిర్యాదులో పేర్కోంది. దీంతో కూటమి ప్రభుత్వం నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కూటమి ప్రభుత్వం విమర్షలు కురిపించింది.
ధర్మాపనం నామినేషన్లు అడ్డుకున్న 21 గ్రామాల్లో అభ్యర్థులతో మళ్లీ నామినేషన్లు వేయించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఎస్పీ స్వయంగా వారి దగ్గరుండి నామినేషన్లు వేయించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు అభ్యర్థులకు నామినేషన్ల ప్రక్రియలో ఆటంకం లేకుండా చూడాలని పోలీసులు దగ్గరుండి చూడాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది.
Also read: స్నానం చేసి రాలేదని.. పిల్లలను బడి నుంచి గెంటేసిన హెచ్ఎం!