Chittoor Incident: చిత్తూరు జిల్లాలో దారునం చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెలితే చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం అనగాలపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ స్థానం అన్‌రిజర్వ్‌డ్ మహిళకు కేటాయించడంతో తన భార్యకు పోటీ చేసే అవకాశం దక్కలేదని మనస్తాపానికి గురై గిరిబాబు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది.
గ్రామంలో వైసీపీకి చెందిన 11 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి పోటీ పడేందుకు ఆసక్తి చూపినట్లు సమాచారం. దీంతో స్థానిక నాయకుల జోక్యంతో ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు అభ్యర్థులు పోటీకి అవకాశం కల్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని నాయకుల వద్ద ఆవేదన వ్యక్తం చేయడంతో వారికి పోటీ చేసే అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
అయితే పోటీలో మూడో వ్యక్తి అయిన గిరిబాబు తన భార్యకు సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గిరిబాబు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడ ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది.
Also read: రామోజీ జయంతి జీవో వివాదం.. సీఎం చంద్రబాబుకు అంబటి చురకలు!