The Altruists OTT: సాధారణంగా సినిమాల్లో హీరోలు పేదలకు సాయం చేయడానికి దొంగతనాలు చేయడం మనం చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో ప్రపంచాన్ని మారుస్తాం, మేము సంపాదించే లాభాల్లో 99 శాతం పేదలకు దానం చేస్తాం అని నమ్మించి, చివరికి చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మోసానికి పాల్పడిన ఒక జంట కథ చెప్పుకుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. 2019-2022 మధ్య కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన ‘ఎఫ్‌టీఎక్స్’ (FTX) క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ పతనం, దాని వెనుక ఉన్న 8 బిలియన్ డాలర్ల (దాదాపు ₹67,000 కోట్లు) భారీ ఆర్థిక కుంభకోణం ఆధారంగా ఈ కథను వెబ్ సిరీస్ గా తెరకెక్కించారు. ఒకప్పుడు క్రిప్టో ప్రపంచాన్ని శాసించి, ‘జెన్-జీ బోనీ అండ్ క్లైడ్’ గా పిలవబడిన సామ్ బ్యాంక్‌మన్-ఫ్రైడ్, కరోలిన్ ఎల్లిసన్ నిజ జీవిత సంచలన ఉదంతం ఇప్పుడు వెబ్ సిరీస్‌గా వచ్చేసింది. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్మాణ సంస్థ ‘హయ్యర్ గ్రౌండ్’ నిర్మించిన బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా ‘ది ఆల్ట్రూయిస్ట్స్’ (The Altruists) నేడు (నవంబర్ 19) ఓటీటీలోకి అడుగుపెట్టింది. విడుదలైన కొద్దిసేపటికే ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అసలు ఆ 8 బిలియన్ డాలర్ల స్కామ్ కథేంటో ఇప్పుడు చూద్దాం.
2019-2022 మధ్య కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన ఎఫ్‌టీఎక్స్ (FTX) క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ పతనం నేపథ్యంలో ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ సాగుతుంది. ఎంతో తెలివైన యువ మేధావులైన సామ్ బ్యాంక్‌మన్-ఫ్రైడ్ (ఆంథోనీ బాయిల్) అలమెడా రీసెర్చ్ సీఈఓ కరోలిన్ ఎల్లిసన్ (జూలియా గార్నర్) సమాజానికి మంచి చేయాలనే ‘ఎఫెక్టివ్ ఆల్ట్రూయిజం’ సిద్ధాంతంతో వ్యాపారంలోకి దిగుతారు. అతి తక్కువ కాలంలోనే బిలియనీర్లుగా ఎదిగి, బహామాస్ దీవుల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను తమ వైపు తిప్పుకుంటారు. అయితే వారి మధ్య నడిచిన విషపూరిత ప్రేమబంధం, తెరవెనుక సామ్ చేసిన సాఫ్ట్‌వేర్ మాయాజాలం అసలు రంగు బయటపెడుతుంది. కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాల్లా నమ్మి ఎఫ్‌టీఎక్స్‌లో దాచుకున్న బిలియన్ల కొద్దీ డబ్బును, రహస్యంగా అలమెడా సంస్థ రిస్కీ పెట్టుబడులకు మళ్లించి ఏకంగా 8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 67 వేల కోట్లు) భారీ కుంభకోణానికి పాల్పడతారు. క్రిప్టో మార్కెట్ కుప్పకూలినప్పుడు ఆ 32 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం పేకమేడలా ఎలా కూలిపోయింది? చివరికి వారిద్దరూ జైలు పాలైన తీరును నరాలు తెగే ఉత్కంఠతో చూపించారు.
‘ది ఆల్ట్రూయిస్ట్స్’ (The Altruists) సిరీస్‌లో సామ్ బ్యాంక్‌మన్-ఫ్రైడ్‌గా ఆంథోనీ బాయిల్ (Anthony Boyle), కరోలిన్ ఎల్లిసన్‌గా జూలియా గార్నర్ (Julia Garner) నటించారు. గ్రాహం మూర్ (Graham Moore), జాక్వెలిన్ హోయ్ట్ (Jacqueline Hoyt) ఈ సిరీస్‌ను రూపొందించగా, జేమ్స్ పోన్సోల్డ్ట్ (James Ponsoldt) తొలి ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించారు. మొత్తం 8 ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ లిమిటెడ్ సిరీస్ నవంబర్ 19, 2026 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఇంగ్షీ ష్, తెలుగు, తమిళం, హిందీ ఆడియోలలో అందుబాటులో ఉంది.