E-Paper
Advertisement

రామోజీ జయంతి జీవో వివాదం.. సీఎం చంద్రబాబుకు అంబటి చురకలు!

రామోజీ జయంతి జీవో వివాదం.. సీఎం చంద్రబాబుకు అంబటి చురకలు!
Advertisement

Ambati Rambabu: టీడీపీతో ఎన్నికల కమీషన్ కుమ్మక్కయిందంటూ వైసీపీ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైఎస్సార్ సీపీ నేతల నామినేషన్లు వేయటానికి వెళ్తే దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓటర్లను ఆకట్టుకోవడం కంటే అధికారులను కొనుగోలు చేయటమే బెటరని చంద్రబాబు అనుకుంటున్నారని, పులివెందుల నియోజకవర్గంలో 21 కేంద్రాలలో నామినేషన్లు వేయనీయలేదని ఫైర్ అయ్యారు.

రామోజీ వర్ధంతికి రూ.15 కోట్లు ఖర్చు..

పోలీసుల సహాయంతో దాడులు చేసి అడ్డుకున్నారు. అధికారులకు పదేపదే చెప్పినా వినిపించుకోలేదని, దీంతో వేంపల్లి సర్పంచ్ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారని అన్నారు. పోలీసులు, అధికారులే దగ్గరుండి వారందరితోనూ నామినేషన్లు వేయించాలని ఆదేశించింది. రామోజీ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించాల్సిన అవసరం ఏంటి? రామోజీ వర్ధంతికి కూడా రూ.15 కోట్లు ఖర్చు చేశారని, దేశానికి ద్రోహం చేసిన వ్యక్తి, ఆర్ధిక నేరగాడికి రాష్ట్ర ప్రభుత్వం పండుగ చేయటం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు.

దుర్మార్గపు జీవో..

Advertisement

జనం చంద్రబాబు చర్యలు చూసి జనం నవ్వుతున్నారు. ఈ దుర్మార్గపు జీవోని వెంటనే రద్దు చేయాలని అంబటి రాంబాబు అన్నారు. రామోజీరావు జయంతిని టీడీపీ ఆఫీసులో సొంత డబ్బుతో చేసుకోండని, ప్రజల సొమ్ముతో పండుగలు చేయాలనుకోటం దగుల్భాజీ నిర్ణయం వెన్నుపోటు సమయంలో చంద్రబాబుకు అండగా ఉంటే ఇలా పండుగలు చేస్తారా అని చంద్రబాబు నాయుడిని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Also Read: కూటమి ప్రభుత్వం పై హైకోర్టు ఫైర్.. వైసీపీ పార్టీకి గుడ్ న్యూస్?

Tags

Related News

కూటమి ప్రభుత్వం పై హైకోర్టు ఫైర్.. వైసీపీ పార్టీకి గుడ్ న్యూస్?

లోకేష్‌కు బిజినెస్ సమ్మిట్లపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదా?: పేర్ని నాని

ఆరు నెలలకే ప్రపంచ రికార్డు.. బుడిబుడి అడుగుల్లో బుల్లి సంచలనం!

పులివెందులలో నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి, పలువురికి గాయాలు

రాప్తాడు ఘటన వ్యవహారం.. ఆసుపత్రి నుంచి నిందితుడు డిశ్చార్జ్, పోలీసుల విచారణ మొదలు

ఈవీఎం లేదా బ్యాలెట్.. ఏదైనా ప్రజల మద్దతు కూటమికే.. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, కూటమి నేతల క్లారిటీ

రూటు మార్చిన వైసీపీ.. బీజేపీని టార్గెట్ చేస్తూ, మంత్రి సత్యకుమార్‌పై పేర్ని నాని విసుర్లు

Big Stories

Advertisement
×