Car and Bike Names: కొత్త కారు, బైక్ మార్కెట్లోకి వస్తుందంటే ముందుగా దాని డిజైన్, ఫీచర్లు, ఇంజిన్, ధర గురించి చర్చ జరుగుతుంది. కానీ, ఆ వెహికల్ కు పెట్టిన పేరు కూడా అంతే క్రేజీగా ఉంటుంది. కొన్నింటికి జంతువుల పేర్లు పెడితే, మరికొన్నింటికి సిటీలు, మౌంటెయిన్స్, పురాణ పాత్రల పేర్లు పెడుతుంటారు. ఇంకొన్ని మోడళ్ల పేర్లు వాటి ప్రత్యేకతలను రిఫ్లెక్ట్ చేసేలా ఉంటాయి. అసలు ఆటోమొబైల్ కంపెనీలు కొత్త కార్లు, బైక్‌లకు పేర్లు ఎలా సెలెక్ట్ చేస్తాయి? వాటి వెనుక ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే..
కారు, బైక్‌కు పేరు పెట్టడం అంత ఈజీ కాదు. కంపెనీలు కొత్త మోడల్ ను డెవలప్ చేస్తున్న దశ నుంచే దాని పేరును ఆలోచించడం మొదలుపెడతాయి. వాహనం ఏ రకమైన కస్టమర్లను ఆకర్షించాలి? దాని డిజైన్ ఎలా ఉంది? ఎలాంటి పనితీరు అందిస్తుంది? అనే అంశాలను కూడా పేరు విషయంలో లెక్కలోకి తీసుకుంటాయి. ఒకవేళ స్పోర్ట్స్ కారుకు స్పీడ్, పవర్ ను గుర్తు చేసే పేరు పెడితే.. ఫ్యామిలీ కారుకు చక్కటి సౌకర్యం, నమ్మకాన్ని కలిగించే పేరు సెలెక్ట్ చేస్తారు. పేరు వినగానే వెహికల్ మీద చక్కటి అభిప్రాయం కలిగేలా చూసుకుంటారు.
కొన్ని కంపెనీలు జంతువులు, పక్షులు, ప్రకృతిలోని అంశాల నుంచి పేర్లు తీసుకుంటాయి. ఫోర్డ్ మస్టాంగ్ (Ford Mustang) పేరును తీసుకుంటే.. మస్టాంగ్ అంటే అడవి గుర్రం. స్పీడ్, ఫ్రీడమ్ తో పాటు దూకుడుకు ప్రతీకగా ఉంటుంది. లంబోర్గినీ తన కార్లకు ఎద్దుల ఫైటింగ్ కు సంబంధించిన పేర్లను ఉపయోగిస్తారు. కంపెనీ వ్యవస్థాపకుడు ఫెర్రూచియో లంబోర్గినీకి ఎద్దుల ఫైటింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా ఈ పేర్లను తీసుకుంటున్నారు.
కొన్ని వాహనాల పేర్లు పాపులర్ ప్లేసెస్, మౌంటెయిన్స్ , రివర్స్, హిస్టారికల్ పర్సన్స్ నుంచి కూడా తీసుకుంటారు. జీప్ కంపాస్(Jeep Compass) లాంటి పేర్లు డైరెక్షన్ ను దిశను సూచిస్తే, టాటా సఫారీ (Tata Safari) పేరు అండ్వెంచర్స్ ను గుర్తుకు తెస్తుంది. కొన్ని కంపెనీలు తమ బ్రాండ్ గుర్తింపును ప్రతిబింబించేలా స్పెషల్ నేమ్స్ క్రియేట్ చేస్తాయి. మరికొన్ని మోడళ్లకు సంఖ్యలు, అక్షరాల కలయికతో పేర్లు పెడతాయి.
ఒక పేరును ఎంపిక చేసిన తర్వాత కంపెనీలు దాని మీద చాలా పరిశీలనలు చేస్తాయి. పలు దేశాల్లో ఆ పదానికి ఎలాంటి అర్థం ఉంది? పలకడానికి సులభంగా ఉందా? ఇప్పటికే మరో కంపెనీ ఆ పేరును ట్రేడ్‌మార్క్ గా నమోదు చేసుకుందా? అనే విషయాలను చెక్ చేస్తారు. అవసరమైతే మార్కెట్ లో స్టడీ చేసికస్టమర్ల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటాయి. చివరకు అన్ని అంశాలు అనుకూలంగా ఉంటేనే ఆ పేరును అధికారికంగా ప్రకటిస్తాయి.
కారు లేదంటే బైక్ పేరు అనేది కేవలం గుర్తింపు కోసం మాత్రమే కాదు. ఆ వాహనం ప్రత్యేకతను, కంపెనీ ఆలోచనలను, కస్టమర్లతో ఏర్పడే అనుబంధాన్ని ప్రతిబింబించే కీలక అంశంగా పరిగణిస్తారు. అందుకే కొత్త వాహనం తయారీ ఎంత ముఖ్యమో దానికి సరైన పేరు సెలెక్ట్ చేయడం కూడా కంపెనీలకు అంతే కీలకం.
Read Also: బైక్‌లలో 100cc, 125cc, 150cc అంటే ఏంటి? ఇంజిన్ వెనుక అసలు లెక్క ఇదే!