BigTV English

Vijayawada: విజయవాడలో టీడీపీ- బీఆర్ఎస్ నేతల భేటీ, ఏం జరిగింది?

Vijayawada: విజయవాడలో టీడీపీ- బీఆర్ఎస్ నేతల భేటీ, ఏం జరిగింది?

Vijayawada: పైన ఫోటోలో కనిపిస్తున్న నేతలంతా ఒకప్పుడు టీడీపీలో ఉన్నవారే. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చెదిరిపోయారు. ఏపీ-తెలంగాణ నేతలుగా విడిపోయారు. ప్రస్తుతం వేర్వేరు పార్టీల్లో ఉంటున్నారు. టీడీపీ-టీఆర్ఎస్-కాంగ్రెస్ నేతలు వారంతా.


ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించింది అలనాటి ఓబులాపురం మైనింగ్ కేసు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. 2007లో ఓబుళాపురం మైనింగ్ తవ్వకాలు అడ్డగోలుగా జరిగాయి. అప్పటి వైఎస్ఆర్ సర్కార్‌కు మంత్రి గాలి జనార్థన్‌రెడ్డికి గనులు దోచిపెడుతోందని ఆరోపిస్తూ నేతలంతా ఆందోళనకు దిగారు. అప్పట్లో ఆయా నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

అందుకు సంబంధించిన కేసు విచారణ నిమిత్తం మంగళవారం విజయవాడ కోర్టుకు హాజరయ్యారు ఆయా నేతలంతా. విచారణ జనవరి 8కి వాయిదా పడింది. న్యాయస్థానం ముందు హాజరైన వారిలో మంత్రి అచ్చెన్నాయుడు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు.


వీరితోపాటు బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, నాగం జనార్థన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీబీ రాజేంద్రప్రసాద్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరావు, చినరాజప్ప, పడాల అరుణ, అమర్నాథ్ రెడ్డి ఇంకా చాలామంది ఉన్నారు.

ALSO READ:  ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌‌‌పై ఏసీబీ కేసు నమోదు

ఈ క్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నోరు విప్పారు. తామంతా స్నేహితులమని, గతంలో టీడీపీలో పని చేశామని చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో ఉన్నా, అందరూ ప్రజాసేవలో ఉన్నామన్నారు. ఆ తర్వాత ఏపీ-తెలంగాణ రాజకీయాల గురించి చిన్నపాటి చర్చ జరిగినట్టు ఓ వార్త గుప్పుమంది.

తెలుగు రాష్ట్రాలకు గురుశిష్యులిద్దరు ఒకేసారి ముఖ్యమంత్రులు అయ్యారని, నిజాయితీగా ఉంటే అవకాశాలు తప్పకుండా వస్తాయని అన్నారట. దూకుడుగా వెళ్తున్నారంటూ మాట్లాడుకున్నారట. ప్రజా సేవ చేస్తే నాలుగు కాలాలపాటు ప్రజల మనసులో ఉండిపోతారని చెప్పుకుంటూ హాయిగా నవ్వుకున్నారు ఆయా నేతలంతా. ఆ తర్వాత నేతలంతా తమ వాహనాలు తిరిగి హైదరాబాద్‌కు తిరిగి పయనమయ్యారు.

 

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×