Mohan Babu:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యంత హాట్ టాపిక్ గా మారిన అంశాలలో అల్లు అర్జున్ (Allu Arjun) సంధ్య థియేటర్ ఘటన ఒకటైతే, ఇంకొకటి మంచు ఫ్యామిలీ (Manchu Family)లో గొడవలు. గత కొన్ని నెలలుగా అన్నదమ్ములైన మంచు మనోజ్(Manchu Manoj), మంచు విష్ణు (Manchu Vishnu)మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయంటూ వార్తలు రాగా.. ఇప్పుడు ఏకంగా మంచు మోహన్ బాబు(Mohan Babu) ఇన్వాల్వ్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దగా నిలిచిన మోహన్ బాబు.. తన కుటుంబంలో సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు అంటూ నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోని ఆస్తుల కోసం తండ్రీ కొడుకుల మధ్య గొడవలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. వందల కోట్ల ఆస్తులు ఉన్న వీరి మధ్య ఈ ఆస్తి తగాదాలు ఏంటి? అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.
అజ్ఞాతంలో మోహన్ బాబు..
ఇదిలా ఉండగా జల్పల్లి లో ఉన్న మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద జరిగిన ఘటనపై పోలీసులు విచారణకు రావాలని మోహన్ బాబుకు నోటీసులు పంపించారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా తాను విచారణకు రాలేనని తెలిపిన మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు.కానీ మోహన్ బాబు పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. మరొకవైపు విచారణకు రాలేనని తెలపడంతో ఆ విచారణను రాచకొండ పోలీసులు డిసెంబర్ 24కు వాయిదా వేశారు. ఇక నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. నిన్న కూడా మోహన్ బాబు విచారణకు రాకపోవడంతో పోలీసులు ఈ విషయంపై సీరియస్ అవుతున్నట్లు తెలుస్తోంది.
అరెస్ట్ తప్పదా.. ?
రెండుసార్లు నోటీసులు పంపించినా హాజరు కాకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఆయనకు మళ్ళీ నోటీసులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మోహన్ బాబు ఎక్కడ ఉన్నారు అంటూ పహాడీ షరీఫ్ పోలీసులు కూడా గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది. మరొకసారి నోటీసులు పంపించి, ఆయన రాకపోతే ఖచ్చితంగా ఆయనను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై పలువురు నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. విచారణకు రాకుండా మోహన్ బాబు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు? అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి మోహన్ బాబు నిజంగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా? లేక కావాలనే విచారణకు వెళ్లలేదా? అనే అంశాలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
అసలు చిక్కంతా అక్కడే..
అసలు విషయంలోకి వెళ్తే.. మోహన్ బాబు నివాసంలోకి మంచు మనోజ్ ప్రవేశించడానికి ప్రయత్నం చేసినప్పుడు.. మోహన్ బాబు ఇంటి గేటు వద్ద ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన ఆయన గేట్ లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తగా మారింది. ఇక అదే సమయంలో అక్కడికి వచ్చిన మోహన్ బాబును మీడియా మిత్రులు ప్రశ్నించే ప్రయత్నం చేయగా.. వారి దగ్గర ఉన్న టీవీ మైక్ తీసుకొని వారి బుర్రలు పగలగొట్టారు మోహన్ బాబు.దీంతో బాధిత జర్నలిస్టులు మోహన్ బాబు నుంచి తమకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దీనికి తోడు ఆయన దగ్గరున్న లైసెన్సుడ్ గన్ ను కూడా తీసేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు విచారణకు పిలిస్తే రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.