Amaravati: ఏపీలో ఈనెల 13 నుంచి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత సహకార సంఘాల సొసైటీ ఎన్నికలకు కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ రెండింటికి మధ్య పులివెందులకు ఉప ఎన్నిక రావచ్చని కూటమి పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. అదే జరిగితే వైసీపీ అధినేత జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారనుంది.
పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయంగా కనిపిస్తోంది. దానికి సంబంధించి అడుగులు చకచకా వేస్తోంది కూటమి ప్రభుత్వం. ఉన్నట్లుండి పులివెందుల నియోజకవర్గానికి బైపోల్ ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కంచుకోటలు బద్దలయ్యాయి. ఇలాంటి సమయంలో బైపోల్ కు వైసీపీ అధినేత రెడీ అవుతారా? అన్నది అసలు ప్రశ్న.
వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు కంటిన్యూ 59 రోజులపాటు హాజరుకాలేదు. మరొక రోజు హాజరుకాకుండా సభ్యత్వం రద్దు అయ్యే అవకాశం ఉంది. సమావేశాలకు వరుసగా 60 రోజులు హాజరు కాకపోతే దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకుని అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో డిసెంబర్‌లో జరగనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా? అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్.
ALSO READ: పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు తప్పుతున్న కూటమి? మార్పులు తప్పవా?