E-Paper
Advertisement

జగన్ దారిలో వైసీపీ నేతలు.. చెవిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. మరో ఆరునెలల్లో ఎన్నికలు-తడాఖా చూపిస్తాం

జగన్ దారిలో వైసీపీ నేతలు..  చెవిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. మరో ఆరునెలల్లో ఎన్నికలు-తడాఖా చూపిస్తాం
Advertisement

Chevireddy: స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వైసీపీ పరిస్థితి ఏంటి? ఈ విషయంలో అధినేత జగన్ బాటలో వైసీపీ కీలక నేతలు నడుస్తున్నారా? తాజాగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కీలక వ్యాఖ్యల వెనుక అసలు ఏం జరిగింది? ఆరునెలల్లో ఎన్నికలు వస్తాయని ఎందుకు అన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. ఇంతకీ ఏపీలో ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు వెళ్తోందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

జగన్ దారిలో వైసీపీ నేతలు.. చెవిరెడ్డి కీలక వ్యాఖ్యలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు వెల్లడి తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. ఆరు నెలల్లో మళ్లీ ఎన్నికలు వస్తాయని, అప్పుడు మా తడాఖా చూపిస్తామన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగుర వేస్తామని తేల్చేశారు. చంద్రగిరి నియోజకవర్గం చెవిరెడ్డి అడ్డా. తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి విజయం సాధించారు.

Advertisement

అనంతరం మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి, చంద్రగిరిలో మూడు జెడ్పీటీసీ స్థానాలు గెలిచామన్నారు. మిగిలిన మూడు మండలాల్లో రీపోలింగ్ కోసం న్యాయపోరాటం చేస్తామన్నారు. నామినేషన్ల నుంచే దాడులు, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. గెలుపు ఖరారు అయినా డిక్లరేషన్ ఇవ్వడంలో జాప్యం జరిగిందన్నారు. కొడుకు మోహిత్‌రెడ్డిని గెలిపించినందుకు ప్రజలకు చెవిరెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.

మరో ఆరునెలల్లో ఎన్నికలు, మా తడాఖా చూపిస్తాం-చెవిరెడ్డి

చెవిరెడ్డి కీలక వ్యాఖ్యల వెనుక ఏం జరుగుతోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. గతంలో జగన్ కూడా మరో ఆరు నెలల్లో ఎన్నికలు వచ్చేస్తున్నాయంటూ ఢంకా బజాయించేవారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఆ స్లోగన్ అందుకున్నారు. ఒకవేళ అదే జరిగితే జగన్ పాదయాత్ర ఎప్పుడు మొదలుపెడతారంటూ అభిమానులు ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.

Advertisement

కూటమి సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్తోందా? 2004లో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో అప్పుడు టీడీపీ ఘోర ఓటమి పాలైంది. దాన్ని నుంచి తేరుకోవడానికి దాదాపు దశాబ్ద కాలం పట్టింది. ఏదో కార్యకర్తలు, అభిమానులను ఉత్సాహ పరచడానికి ఆ విధంగా చెవిరెడ్డి మాట్లాడి ఉంచవచ్చని అంటున్నారు.

ALSO READ: పరిషత్ ఎన్నికల్లో దేవుడి స్క్రిప్ట్ రిపీట్.. 17 జిల్లాల్లో వైసీపీ ఎన్నిసీట్లు అంటే.. ఆ 11 జిల్లాలు మాత్రమే

Related News

పరిషత్ ఎన్నికల్లో దేవుడి స్క్రిప్ట్ రిపీట్.. 17 జిల్లాల్లో వైసీపీ ఎన్నిసీట్లు అంటే.. ఆ 11 జిల్లాలు మాత్రమే

కంచుకోటలు కూలినా వైసీపీ పరువు కాపాడిన అల్లూరి జిల్లా.. జెడ్పీ పీఠంపై ఫ్యాన్ పార్టీ, కూటమిని దెబ్బ కొట్టిన

స్థానిక ఎన్నికల్లో తండ్రీ-కొడుకులకు భయం.. ఆ భయం నన్ను వెంటాడుతోంది-అంబటి, ‘బిగ్‌టీవీ స్ట్రెయిట్ టాక్‌’లో..

పరిషత్ ఎన్నికల ఫలితాలపై జగన్ రియాక్ట్.. ప్రజల మనసులు గెలుచుకున్నాం

పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు.. పల్లెల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న అధికార పార్టీ

కూటమికి ప్రభుత్వానికి ఊహించని షాక్.. రాజానగరంలో వైసీపీ ఘనవిజయం!

కూటమి ఆధిపత్యానికి జక్కంపూడి రాజా చెక్.. మాజీ ఎమ్మెల్యే స్కెచ్‌తో తిరగబడ్డ ఫలితాలు!

Big Stories

Advertisement
×