E-Paper
Advertisement

మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం!

మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం!
Advertisement

Madhya Pradesh Fire: మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లా బర్హి పట్టణంలో సోమవారం తెల్లవారుజామున ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఓ వ్యాపారికి చెందిన మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. చూస్తుండగానే అగ్నికీలలు ఇల్లంతా వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్నవారికి బయటకు వచ్చేందుకు అసలు మార్గమే లేకుండా పోయింది.

నిద్రలోనే మింగేసిన మంటలు

Advertisement

ఈ విషాదకర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మృతుల్లో రెండు నెలల పసికందుతో పాటు చిన్న పిల్లలు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లోని వారంతా గాఢ నిద్రలో ఉండటంతో పొగ చుట్టుముట్టి ఊపిరాడక, బయటకు పరిగెత్తే వీలులేక భవనంలోనే చిక్కుకుపోయారు.

షాట్ సర్క్యూటే కారణమా?

Advertisement

స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. శవాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక అంచనా ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో బర్హి పట్టణంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

Also Read: ఇల్లు, పెళ్లి, కారు.. మీ సంపాదనతో ముందుగా దేనికి ఖర్చు చేయాలి?

Tags

Related News

విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొట్టిన కారు, ఆరుగురు సజీవ దహనం, యూపీలో షాకింగ్ ఘటన

దీపావళి ఎఫెక్ట్.. డేంజర్ స్థాయిలో ఢిల్లీ వాయు కాలుష్యం, నాలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి

కూర రుచిగా లేదన్నందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపి ఆ తర్వాత, అహ్మదాబాద్‌లో విచిత్ర ఘటన

4 లక్షల మందికి విందు, గుర్రాల రేసు, విజేతకు కారు బహుమతి.. కూతురు పెళ్లిలో ఎమ్మెల్యే హంగామా

పార్కింగ్ వివాదం.. సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఓఓ దారుణ హత్య, 19 రౌండ్లు కాల్పులు

మావోయిస్టుల గడ్డపైకి ప్రధాని.. బలగాలతో కలిసి దీపావళి వేడుకలు.. ‘దిమాగీ నక్సల్స్’పై సంచలన వ్యాఖ్యలు!

దీపావళి ముందు తీవ్ర విషాదం.. రోడ్డుపై లేడీ డ్రైవర్ బీభత్సం.. బైకర్‌ను 30 మీటర్లు ఈడ్చుకెళ్లిన థార్!

Big Stories

Advertisement
×