Best air purifiers under 5000: ప్రస్తుత కాలంలో వాయు కాలుష్యం కేవలం బయటే కాదు..మనం నివసించే ఇళ్లలోకి కూడా చొచ్చుకొస్తోంది. ముఖ్యంగా నగరాల్లో.. నివసించే వారికి గాలిలో.. ఉండే దుమ్ము, ధూళి, పొగ వల్ల ఆస్తమా, అలర్జీలు, శ్వాస సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇళ్లలోని గాలిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఎయిర్ ప్యూరిఫైయర్.. వాడకం ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే.. ఎయిర్ ప్యూరిఫైయర్లు అంటే.. వేల రూపాయలు పెట్టి కొనాలని చాలామంది వెనకడుగు వేస్తుంటారు. కానీ, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా.. కేవలం రూ.4,499 ధర నుంచే కొన్ని అద్భుతమైన ఎయిర్ ప్యూరిఫైయర్లు మార్కెట్లో లభిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా ఎయిర్ ప్యూరిఫైయర్స్ అంటే రూ. 10,000 నుంచి రూ. 30,000 వరకు ఉంటాయని భావిస్తారు. కానీ బ్రాండెడ్ కంపెనీలు ఇప్పుడు చిన్న రూమ్స్, బెడ్‌రూమ్‌ల కోసం కాంపాక్ట్ సైజులో.. తక్కువ ధరకే హెపా ఫిల్టర్ ఉండే,, ప్యూరిఫైయర్లను తీసుకువచ్చాయి. ఇవి గాలిలోని 99.97% సూక్ష్మ కణాలు, దుమ్మును తొలగిస్తాయి.
Xiaomi Smart Air Purifier 4 Compact / Lite సిరీస్:
ఇవి సుమారు రూ.4,999 నుంచి ప్రారంభం అవుతాయి. ఇది చిన్న గదులకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అంతే కాకుండా ఇది ట్రూ HEPA ఫిల్టర్‌తో వస్తుంది. కాబట్టి స్మార్ట్‌ఫోన్ యాప్ లేదా గూగుల్ అసిస్టెంట్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయవచ్చు. తక్కువ కరెంట్ ఖర్చుతోనే ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
Levoit Core 200S / Mini Air Purifier:
దీని ధర సుమారు రూ.4,499 నుంచి రూ. 5,499 మధ్య ఉంటుంది. కాంపాక్ట్ డిజైన్‌తో కూడిన దీని ప్యూరిఫైయర్ నిద్రపోయేటప్పుడు ఎలాంటి శబ్దం చేయకుండా సైలెంట్‌గా పని చేస్తుంది. దీనిలో అరోమాథెరపీ ఫీచర్ కూడా ఇందులో ఉండటం విశేషం.
దీని ధర సుమారు రూ.6,999 (బడ్జెట్ రేంజ్‌లో బెస్ట్). కామన్ గా ఫిలిప్స్ బ్రాండ్ అనగానే నమ్మకం ఉంటుంది. ఇది గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు రంగుల రూపంలో సూచిస్తుంది. అంతే కాకుండా ఆటో మోడ్ ఆప్షన్ ఉండటం వల్ల గాలిలోని కాలుష్యానికి తగినట్లుగా స్పీడ్ మారుతుంది.
దీని ధర సుమారు రూ.4,499. వర్క్ డెస్క్ దగ్గర లేదా చిన్న పిల్లల గదిలో పెట్టుకోవడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది పోర్టబుల్ సైజులో లభిస్తుంది కాబట్టి ఎక్కడికైనా ఈజీగా మార్చుకోవచ్చు.
దీని ధర సుమారు రూ. 4,999. దీనిలోని యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్, HEPA ఫిల్టర్ ఆప్షన్లు గాలిలోని దుర్వాసనలను, పొగను సమర్థవంతంగా తొలగిస్తుంది.